- Telugu News Photo Gallery Business photos These are the best deals on cars, discounts up to Rs 5 lakh, check details
Diwali Car Offers: దివాళి హాట్ డీల్స్.. ఈ కార్లపై ఏకంగా రూ. 5లక్షల వరకూ తగ్గింపు..
మీరు కారు కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నారా? ఈ పండుగ సీజన్లో ఆఫర్ల కోసం వెయిటింగ్ చేస్తున్నారా? ఇక మీ వెయింటింగ్ కు ఫుల్ స్టాప్ పడినట్లే. ఎందుకంటే దీపావళి పండుగను పురస్కరించుకొని అన్ని కంపెనీలు అత్యద్భుతమైన డిస్కౌంట్లు, ఆఫర్లు, బ్యాంక్ క్యాష్ బ్యాక్ లు అందిస్తున్నాయి. పలు కార్లపై దాదాపు రూ. 5లక్షల వరకూ ప్రయోజనాలను అందిస్తున్నాయి. వాటిల్లో టాప్ 5 ఆఫర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Madhu | Edited By: Ravi Kiran
Updated on: Nov 09, 2023 | 9:15 PM

హ్యూందాయ్ కోనా ఎలక్ట్రిక్.. దీని ధర మన దేశంలో రూ. 23.84లక్షల నుంచి రూ. 24.03 లక్షల వరకూ ఉంటుంది. దీనిపై మీకు రూ. 2లక్షల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. దీనిలో 39.2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 451 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలో 134.14బీహెచ్పీ, 395ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

సిట్రోయిల్ సీ5 ఎయిర్ క్రాస్.. ఈ కారుపై రూ. 2.5లక్షల వరకూ తగ్గింపు లభిస్తుంది. ఇది యూనిక్ డిజైన్ తో కంఫర్టబుల్ జర్నీని అందిస్తుంది. దీనిలో 2.0లీటర్ల డీజిన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 174.57 బీహెచ్పీ, 400ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 36.91 లక్షల నుంచి రూ. 37.67లక్షలు ఉంటుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ400.. దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్ యూవీ కారు ఇది. దీనిపై మీకు రూ. 3లక్షల వరకూ ఆఫర్ వస్తుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 15.99 నుంచి 19.19 లక్షల వరకూ ఉంటుంది. దీనిలో రెండు బ్యాటరీ ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. 34.5 కేడబ్ల్యూహెచ్ ఈసీ, 375 కిలోమీటర్ల రేంజ్ తో ఒకటి, 39.4 కేడబ్ల్యూహెచ్ ఈఎల్, 456కిలోమీటర్ల రేంజ్ తో వస్తుంది. దీనిలో మోటార్ 147.94 బీహెచ్పీ, 310 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఎంజీ జెడ్ఎస్ ఈవీ.. ఎంజీ కంపెనీ నుంచి వచ్చిన మొదటి ఫుల్లీ ఎలక్ట్రిక్ కారు ఇది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 22.88లక్షల నుంచి రూ. 26లక్షల వరకూ ఉంటుంది. దీనిపై మీకు పండుగ ఆఫర్లలో భాగంగా రూ. 2.3లక్షల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. దీనిలో 50.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సింగిల్ చార్జ్ పై 461 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 174.57బీహెచ్పీ, 280ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేసే మోటార్ ఉంటుంది.

టోయోటా హైలక్స్.. గ్లోబల్ వైడ్ గా మంచి డిమాండ్ ఉన్న ట్రక్ కార్ ఇది. దీనిపై ఈ ఫెస్టివల్ సీజన్లో రూ. 5లక్షల వరకూ తగ్గింపును పొందొచచు. మీరు కనుక అవుట్ డోర్ ప్రయాణాలు ఎక్కువగా చేసే వారైతే ఈ కారు సరిగ్గా సరిపోతోంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 30.40 లక్షల ణుంచి రూ. 37.90 లక్షల వరకూ ఉంటుంది. దీనిలో 2.8 లీటర్ టర్బో చార్జెడ్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. గరిష్టంగా 201.20 పవర్ అవుట్ పుట్ ను అందిస్తుంది. 500ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.





























