Educational Loans: విదేశాల్లో చదువుకోవడం మీ కలా..? ఆ బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే విద్యారుణాలు
భారతదేశంతో విదేశాలలో ఉన్నత చదువుల కోసం కొత్త విద్యా సంవత్సరం జూన్ నుంచి ఆగస్టు మధ్య ప్రారంభమవుతుంది. అందువల్ల విదేశాలతో పాటు స్వదేశంలో ఉన్నత విద్య అభ్యసించడానికి ఆర్థిక భరోసా కోసం విద్యా రుణాలను ఎంచుకుంటారు. అయితే ఈ విద్యారుణాల్లో వడ్డీ రేట్లు సగటు విద్యార్థులకు ఆందోళను గురి చేస్తాయి. ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీ రేట్లకు విద్యా రుణాలు అందించే బ్యాంకుల కోసం చాలా మంది సెర్చ్ చేస్తారు. ఈ నేపథ్యంలో ఏడేళ్ల కాలవ్యవధితో రూ. 20 లక్షల విద్యా రుణాలపై 13.7 శాతం కంటే తక్కువ వడ్డీ రేట్లను అందించే టాప్ 5 బ్యాంకుల గురించి ఓ సారి తెలుసుకుందాం.