- Telugu News Photo Gallery Business photos State bank of india customers alert charges for atm transactions and cheque books from july 1
State Bank Of India: కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమలు.. వివరాలివే..
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో (ఎస్‌బీఐ) ఖాతా ఉందా.. అయితే ఈ వార్త మీకోసమే. ఎస్‌బీఐ తాజాగా బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ ఖాతాదారులకు...
Updated on: May 26, 2021 | 8:39 AM

ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కస్టమర్లకు షాక్ ఇచ్చింది. బేసిక్ సేవింగ్స్ ఎకౌంటు హోల్డర్లకు జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమలు చేసేందుకు సిద్దమైంది. అటు క్యాష్ విత్ డ్రాయల్, చెక్ బుక్, ఇతర ఆర్థిక లావాదేవీలకు కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.

ఎస్‌బీఐలో బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్-BSBD అకౌంట్ అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్. జీరో బ్యాలెన్స్ అకౌంట్‌లో కనీస నిల్వ (మినిమం బ్యాలెన్స్) ఉండాల్సిన అవసరం ఉండదు.

ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ హోల్డర్లకు బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వస్తుంది. నెలలో నాలుగు సార్లు ఉచితంగా బ్యాంక్ బ్రాంచ్‌లో, ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు డ్రా చేస్తే సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు జూలై 1 నుంచి మారనున్నాయి. ఫస్ట్ నుంచి కొత్త సర్వీస్ ఛార్జీ రూ. 15తో పాటు జీఎస్టీ వర్తిస్తుంది.

ఎస్‌బీఐ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్స్‌తో కూడిన బుక్‌ను ఉచితంగా అందిస్తారు. ఆ తర్వాత బుక్ కావాలంటే పెరిగిన ఛార్జీలతో రూ.40+జీఎస్‌టీ, 25 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.75+జీఎస్‌టీ చెల్లించాలి. 10 చెక్స్‌తో ఎమర్జెన్సీ చెక్ బుక్ కావాలంటే రూ.50+జీఎస్‌టీ చెల్లించాలి.




