జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ భారతదేశంలో ఇటీవల కొత్త జావా 350ని విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ. 2.15 లక్షలుగా ఉంటుంది. 334 సీసీ లిక్విడ్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్ ద్వారా వచ్చే ఈ బైక్ 22బీహెచ్‌పీ, 28.2 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌తో ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ బైక్ యువతను విపరీతంగా ఆకర్షిస్తుంది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో పూర్తి చేసిన 280 ఎంఎం ఫ్రంట్ డిస్క్, 240 ఎంఎం వెనుక డిస్క్ బ్రేక్ ఈ బైక్ రైడర్లకు కొత్త అనుభవాన్ని ఇస్తుంది. జావా 350 క్రూయిజర్ క్లాసిక్ మెరూన్, నలుపు, మైక్స్, ఆరెంజ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.