- Telugu News Photo Gallery Business photos Many fans for those celing fans, These are the best ceiling fans at low prices, amazon Sale 2024 details in telugu
Amazon Sale 2024: ఆ ఫ్యాన్స్‌కు బోలెడంత మంది ఫ్యాన్స్.. తక్కువ ధరలో ది బెస్ట్ సీలింగ్ ఫ్యాన్స్ ఇవే
ఇటీవల కాలంలో ప్రతి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ అనేది తప్పనిసరి వస్తువుగా మారింది. అయితే పెరుగుతున్న కరెంట్ బిల్లు ఫ్యాన్ల వినియోగంపై ప్రభావం చూపుతుంది. అయితే బీఎల్‌డీసీ మోటర్ ద్వారా పని చేసే సీలింగ్ ఫ్యాన్లు కరెంట్ బిల్లుల తగ్గింపులో కీలకపాత్ర పోషిస్తున్నాయి. సాంప్రదాయ సీలింగ్ ఫ్యాన్ల మాదిరిగా కాకుండా బీఎల్‌డీసీ ఫ్యాన్లు బ్రష్ లెస్ మోటార్లను ఉపయోగించుకుంటాయి. శక్తి వినియోగాన్ని తగ్గించి, ఎక్కువ జీవితకాలాన్ని అందిస్తాయి. కాబట్టి ప్రస్తుతం నిర్వహిస్తున్న అమెజాన్ సేల్‌లో బీఎల్‌డీసీ మోటార్లతో కూడిన క్రాంప్టన్, ఓరియంట్, హావెల్స్ వంటి బ్రాండ్ల ఫ్యాన్లపై ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీ సీలింగ్ ఫ్యాన్‌ను మార్చాలని కోరుకుంటే ఈ బీఎల్‌డీసీ మోటర్‌తో వచ్చే సీలింగ్ ఫ్యాన్లపై ఓ లుక్కేయ్యచ్చు.
Srinu |
Updated on: May 17, 2024 | 4:00 PM

ఓరియంట్ ఎలక్ట్రిక్ 1200 ఎంఎం టోమ్ రిమోట్ బీఎల్‌డీసీ సీలింగ్ ఫ్యాన్ శక్తి సామర్ధ్యంతో పాటు అత్యాధునిక సాంకేతికతకు ఉదాహరణగా నిలుస్తుంది. ఈ 5 స్టార్ రేటింగ్ ఉన్న ఫ్యాన్ మీ విద్యుత్ బిల్లులను తగ్గించి, అసమానమైన పొదుపులను అందిస్తుంది. రిమోట్‌తో ఉన్న 1 టోమ్ ఓరియంట్ ఎలక్ట్రిక్ యొక్క అత్యంత శక్తి సమర్ధవంతమైన ఫ్యాన్‌గా నిలుస్తుంది. 26 వాట్ మోటర్‌తో పని చేసే ఈ ఫ్యాన్ 370 ఆర్‌పీఎం వేగంగా తిరుగుతుంది. ఆకట్టుకునే ఎయిర్ డెలివరీతో వచ్చే ఈ ఫ్యాన్ ధర రూ.3499గా ఉంది.

అటామ్ బెర్గ్ రెనెసా స్లీక్ సీలింగ్ ఫ్యాన్ బీఎల్‌డీసీ మోటర్‌తో పని చేస్తుంది. 5 స్టార్ రేటెడ్ సీలింగ్ ఫ్యాన్ 360 ఆర్‌పీఎం వద్ద 235 సీఎంఎంకు సంబంధించిన ఆకట్టుకునే ఎయిర్ డెలివరీని అందిస్తుంది. అయితే కేవలం 28 వాట్ (స్పీడ్ 5 వద్ద) వినియోగిస్తుంది. పనితీరుపై రాజీ పడకుండా విద్యుత్ వినియోగంపై 65 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్ ధర రూ.3699గా ఉంది.

యాక్టివా గ్రేసియా బీఎల్‌డీసీసీలింగ్ ఫ్యాన్ స్మార్ట్ ఐఆర్ రిమోట్‌తో వస్తుంది. అలాగే 6 స్పీడ్ ఎంపికలు, బూస్టర్ మోడ్, అనుకూలమైన టైమర్లు అందించే ఈ ఫ్యాన్ ధర రూ.2499గా ఉంది. 28 వాట్ మోటర్‌తో వచ్చే ఈ ఫ్యాన్ సైలెంట్ ఆపరేషన్‌కు హామీ ఇస్తుంది. ఇన్వర్టర్ బ్యాటరీపై మూడు రెట్లు ఎక్కువ రన్ అయ్యే ఈ ఫ్యాన్ అందరినీ ఆకట్టుకుంటుంది.

క్రాంప్టన్ ఎనర్జీ హైపర్ జెట్ బీఎల్‌డీసీ సీలింగ్ ఫ్యాన్ అమెజాన్ సేల్ 2024లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. యాక్టివ్ బీఎల్‌డీసీ టెక్నాలజీ ద్వారా ఆధారితమైన ఈ సీలింగ్ ఫ్యాన్ అద్భుతమైన 5 స్టార్ ఎనర్జీ రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫ్యాన్ హైపర్ మోడ్‌లో కేవలం 35 వాట్లను మాత్రమే వినియోగిస్తుంది. అందువల్ల ఏకంగా 50 శాతం విద్యుత్‌ను ఆదా చేస్తుంది. ఈ ఫ్యాన్ ధర రూ.2649గా ఉంది.

హావెల్స్ ఆంబ్రోస్ అనేది ఆ కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న బీఎల్‌డీసీ సీలింగ్ ఫ్యాన్స్‌లో ఒకటి. ఈ ఫ్యాన్ అమెజాన్ సేల్ 2024లో అందుబాటులో ఉంది.ఈ హావెల్స్ సీలింగ్ మౌంట్ ఫ్యాన్ దీర్ఘాయువు, ఆధునిక సౌందర్యానికి భరోసానిస్తూ స్టైలిష్ డిజైన్‌తో మన్నికైన అల్యూమినియంతో రూపొందించారు. ఎకో యాక్టివ్ సాంకేతికతతో 5 స్టార్ శక్తి సమర్థవంతమైన బీఎల్‌డీసీ మోటారుతో ఆధారంగా పని చేసే ఈ ఫ్యాన్ ధర రూ.3298గా ఉంది.





























