AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetic Diet: షుగర్ పేషెంట్స్ రోజూ వీటిని టిఫిన్ గా తీసుకోండి.. షుగర్ లెవెల్ పెరగదు..

మధుమేహం అనేది పూర్తిగా తగ్గని సమస్య. పేలవమైన ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి, అధిక బరువు మొదలైన అనేక కారణాల వల్ల ప్రస్తుతం చిన్న వయస్సులోనే షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. చాలా సార్లు ప్రజలలో ఈ సమస్య జన్యుపరంగా సంక్రమిస్తుంది. అంటే (కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉంటే). మరికొందరికి తక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి జరగడం లేదా రక్తంలో షుగర్ లెవెల్ పెరగడంతో మధుమేహం బారిన పడతారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహార పద్దతులను సరిగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే రక్తంలో షుగర్ లెవెల్ పెరుగుతుంది. కొందరిలో ఆహారం తిన్న తర్వాత షుగర్ వేగంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో తినే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అల్పాహారంతో ప్రారంభించాలి.

Surya Kala
|

Updated on: Oct 13, 2024 | 9:59 AM

Share
ఉదయం పూట బ్లడ్ షుగర్ పెరగడం వెనుక గల కారణాలు చాలా సేపు మెలకువగా ఉండడం లేదా సరైన నిద్ర పోకపోవడం. ఈ కారణాల వల్లకార్టిసాల్, గ్లూకోజ్ మొదలైన హార్మోన్ల పెరుగుదల షుగర్ స్థాయిని ప్రభావితం చేస్తాయి. అటువంటి పరిస్థితిలో షుగర్ పేషెంట్స్ ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజు కొన్ని ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ల గురించి  తెలుసుకుందాం.

1 / 5
మల్టీగ్రెయిన్ బ్రెడ్‌.. గుడ్డు:  మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ అల్పాహారంలో ఒక గుడ్డును వారానికి మూడు రోజులు చేర్చుకోవచ్చు. గుడ్లతో ఆమ్లెట్‌ను తక్కువ నూనె లేదా వెన్నతో వేసుకుని సగం ఉడకబెట్టిన తయారు చేసుకోండి. మల్టీగ్రెయిన్ బ్రెడ్‌తో టోస్ట్‌గా తినండి. ఈ రెండిటిలో పోషకాలతో సమృద్ధిగా ఉన్నాయి. రక్తంలో షుగర్ లెవెల్ ను వేగంగా పెంచవు.

2 / 5
సుజీ రవ్వ వెజిటబుల్ ఉప్మా
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఉప్మా ఆరోగ్యకరమైన అల్పాహారం. బీన్స్, బఠానీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమోటా, వేరుశెనగ, క్యాప్సికమ్ వంటి వాటిని జోడించడం ద్వారా ముంబై రవ్వతో ఆరోగ్యకరమైన ఉప్మా తయారు చేసుకోండి. సెమోలినాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కూరగాయలు అనేక పోషకాల నిధి. దీనితో పాటు మీరు గ్రీన్ టీ తీసుకోవచ్చు.

సుజీ రవ్వ వెజిటబుల్ ఉప్మా మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఉప్మా ఆరోగ్యకరమైన అల్పాహారం. బీన్స్, బఠానీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, టమోటా, వేరుశెనగ, క్యాప్సికమ్ వంటి వాటిని జోడించడం ద్వారా ముంబై రవ్వతో ఆరోగ్యకరమైన ఉప్మా తయారు చేసుకోండి. సెమోలినాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. కూరగాయలు అనేక పోషకాల నిధి. దీనితో పాటు మీరు గ్రీన్ టీ తీసుకోవచ్చు.

3 / 5
పెసర పప్పు దోశ మజ్జిగ
డయాబెటిక్ వ్యక్తులకు మూంగ్ దాల్ చీలా అంటే పెసర పప్పు అట్టు మంచి పోషకాహారం కూడా. పప్పును రాత్రంతా నానబెట్టి ఉదయం మెత్తగా రుబ్బుకోవాలి. దేశీ నెయ్యి, వెన్న లేదా ఆలివ్ నూనె తో దోశను తయారు చేసుకోండి. పెసర పప్పు దోశతో పాటు పెరుగు లేదా మజ్జిగను కూడా తీసుకొండి. ఈ అల్పాహారం మధుమేహ వ్యాధిగ్రస్తులకే కాకుండా అందరికీ ఎంతో మేలు చేస్తుంది.

పెసర పప్పు దోశ మజ్జిగ డయాబెటిక్ వ్యక్తులకు మూంగ్ దాల్ చీలా అంటే పెసర పప్పు అట్టు మంచి పోషకాహారం కూడా. పప్పును రాత్రంతా నానబెట్టి ఉదయం మెత్తగా రుబ్బుకోవాలి. దేశీ నెయ్యి, వెన్న లేదా ఆలివ్ నూనె తో దోశను తయారు చేసుకోండి. పెసర పప్పు దోశతో పాటు పెరుగు లేదా మజ్జిగను కూడా తీసుకొండి. ఈ అల్పాహారం మధుమేహ వ్యాధిగ్రస్తులకే కాకుండా అందరికీ ఎంతో మేలు చేస్తుంది.

4 / 5
మఖానా వేయించి తినండి
ఉదయాన్నే టిఫిన్ చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించ లేక పొతే పూల్ మఖానా మంచి టిఫిన్. పూల్ మఖానాను అర టీస్పూన్ దేశీ నెయ్యిలో వేయించాలి. దీనిని అల్పాహారంగా తీసుకోవచ్చు. పూల్ మఖానా రుచికరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర పెరుగుతుందనే భయం ఉండదు. దీనితో పాటు ఒక కప్పు పాలు తీసుకోవచ్చు. కొంత సమయం తరువాత ఒక ఆపిల్ తినవచ్చు.

మఖానా వేయించి తినండి ఉదయాన్నే టిఫిన్ చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించ లేక పొతే పూల్ మఖానా మంచి టిఫిన్. పూల్ మఖానాను అర టీస్పూన్ దేశీ నెయ్యిలో వేయించాలి. దీనిని అల్పాహారంగా తీసుకోవచ్చు. పూల్ మఖానా రుచికరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర పెరుగుతుందనే భయం ఉండదు. దీనితో పాటు ఒక కప్పు పాలు తీసుకోవచ్చు. కొంత సమయం తరువాత ఒక ఆపిల్ తినవచ్చు.

5 / 5
Follow Us
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
గాంధీభవన్‌లో సంబురం.. అపోజిషన్‌లో గరంగరం
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్