Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోనాల స్పెషల్ : మటన్ కర్రీ ఇలా వండితే వావ్ అనాల్సిందే!

ప్రస్తుతం బోనాల పండుగ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. పల్లెల్లో పట్నంలో అంగరంగ వైభవంగా ఈ బోనాల పండుగను జరుపుతున్నారు. ఇక తెలంగాణలో పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో మటన్ గుమ గుమలు ప్రతి వాడలో వస్తుంటాయి. ఇక ఒకొక్కరూ ఒక్కో విధంగా మటన్ వండుతారు. అయితే మనం పల్లెటూర్లలో మటన్ కర్రీని సింపుల్‌గా టేస్టీగా ఎలా వండుతారో ఇప్పుడు చూద్దాం.

Samatha J
| Edited By: TV9 Telugu|

Updated on: Jul 09, 2025 | 7:00 PM

Share
ప్రస్తుతం బోనాల పండుగ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. పల్లెల్లో పట్నంలో అంగరంగ వైభవంగా ఈ బోనాల పండుగను జరుపుతున్నారు. ఇక తెలంగాణలో పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో మటన్ గుమ గుమలు ప్రతి వాడలో వస్తుంటాయి. ఇక ఒకొక్కరూ ఒక్కో విధంగా మటన్ వండుతారు. అయితే మనం పల్లెటూర్లలో మటన్ కర్రీని సింపుల్‌గా టేస్టీగా ఎలా వండుతారో ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం బోనాల పండుగ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. పల్లెల్లో పట్నంలో అంగరంగ వైభవంగా ఈ బోనాల పండుగను జరుపుతున్నారు. ఇక తెలంగాణలో పండుగ వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో మటన్ గుమ గుమలు ప్రతి వాడలో వస్తుంటాయి. ఇక ఒకొక్కరూ ఒక్కో విధంగా మటన్ వండుతారు. అయితే మనం పల్లెటూర్లలో మటన్ కర్రీని సింపుల్‌గా టేస్టీగా ఎలా వండుతారో ఇప్పుడు చూద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : మటన్ కేజీ, ఉల్లిపాయ రెండు, పచ్చి మిర్చీ5, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్స్, పసుపు చిటికెడు, ధనియాల పొడి ఒక టీస్పూన్, యాలకులు,అనాసపువ్వు, దాల్చిన చక్కె, జాజికా వీటన్నింటి పౌడర్ ఒక టీస్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ వన్ స్పూన్. బగారా ఆకులు రెండు, కొత్తిమీర తరుగు ఒక కప్పు, పూదీన తరుగు ఒకకప్పు.కారం, ఉప్పు రుచికి సరిపడ.

2 / 5
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో క్లీన్ చేసి పెట్టుకున్న మటన్‌ను వేయాలి. తర్వాత అందులో కాసింత కారం, ఉప్పు చిటికెడు, ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ వన్ టీస్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి చిటికెడు వేసి కొంచెం ఆయిల్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
తర్వాత స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టి. అందులో సరిపడ నూనె, బగారా ఆకులు, పూదీన తరుగు కొంచెం, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, లవంగాలు రెండు, కట్ చేసిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అవి కాస్త ఎరుపు రంగులోకి వచ్చాక, కలపి పెట్టుకున్న మటన్‌ను అందులో వేసి దోర దోరగా వేయించుకోవాలి.

4 / 5
తర్వాత కొన్ని నీళ్లు పోస్తూ ముక్క మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. ముక్కలు కాస్త మెత్తగా ఉడికిన తర్వాత రుచికి సరిపడ, కారం, ఉప్పు వేయాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత,ధనియాల పొడి, గరం మసాల పొడి, వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత తరిగిన కొత్తిమీర, పూదీనను వేసుకోవాలి. అంతే వేడి వేడి గుమ గుమలాడే మటన్ కర్రీ రెడీ. ఇలా చేస్తే రుచి అదిరిపోతుందంట.

5 / 5