మన దేశంలో దాదాపు ప్రతి వంటింట్లో మిరియాలు తప్పనిసరిగా ఉంటాయి. మరియాలు వంటలకు మంచి రుచితోపాటు ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. మిరియాలను చైనీస్ వంటలలో కూడా ఉపయోగిస్తారు. ఆహార రుచిని పెంచడంలో వీటికి సాటి మరొకటి లేదు. అయితే కారంగా ఉండే మిరియాలు వంట రుచిని పెంచడమే కాదు శరీరానికి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.