- Telugu News Photo Gallery Bengaluru lalbagh botanical garden independence day flower day till 15th august
Independence Day: కనువిందు చేస్తున్న ప్లవర్ షో.. ఈ ప్రదేశాన్ని చూస్తే వావ్ అంటారు!
ప్రదర్శన ఈ భాగాన్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు చేయవచ్చు. పెద్దలకు 70 రూపాయలు, పిల్లలకు 30 రూపాయల చొప్పున ప్రవేశ రుసుము వసూలు చేస్తారు. స్కూల్ యూనిఫాంలో వచ్చే పిల్లలకు ఎలాంటి రుసుము విధించడం లేదని అధికారులు చెబుతున్నారు. గార్డెన్‌లో ఉన్న గ్లాస్ హౌస్, పూల గడియారం, అలాగే లాల్‌బాగ్ రాక్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. లాల్‌బాగ్ చేరుకోవడానికి మీరు బెంగళూరులో నడుస్తున్న స్థానిక రవాణాను ఎంచుకుని వెళ్లవచ్చు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
Updated on: Aug 09, 2023 | 9:28 PM

ఆగస్టు 15 లేదా స్వాతంత్ర్య దినోత్సవాన్ని బెంగళూరులో విభిన్నంగా జరుపుకుంటారు. బెంగళూరులోని లాల్‌బాగ్ బొటానికల్ గార్డెన్‌లో ఆగస్టు 15 వరకు ఫ్లవర్ షో ఏర్పాటు చేశారు. ఈ ఫ్లవర్ షో ఎంతో అద్భుతంగా ఉంటుంది.

లాల్‌బాగ్‌లోని ఫ్లవర్ షో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. నివేదికల ప్రకారం, గులాబీలు, ఇతర పువ్వులతో సహా 70 వేల రకాల పువ్వులు ఉన్నాయి. ఈ ప్లవర్ షోను తిలకించే వారికి మనసు మైమరపించేలా ఉంటుందని చెబుతున్నారు.

పూల రూపకల్పన ద్వారా కన్నడలో పదాలతో ఇక్కడ చాలా విషయాలు రాయడం జరిగింది. అంతే కాకుండా లక్షలాది పూలతో ఇక్కడ శాసనసభను కూడా తీర్చిదిద్దారు. వివిధ రకాల పూలు, ఆకులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ప్లవర్ షోను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

ప్రదర్శన ఈ భాగాన్ని ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు చేయవచ్చు. పెద్దలకు 70 రూపాయలు, పిల్లలకు 30 రూపాయల చొప్పున ప్రవేశ రుసుము వసూలు చేస్తారు. స్కూల్ యూనిఫాంలో వచ్చే పిల్లలకు ఎలాంటి రుసుము విధించడం లేదని అధికారులు చెబుతున్నారు.

గార్డెన్‌లో ఉన్న గ్లాస్ హౌస్, పూల గడియారం, అలాగే లాల్‌బాగ్ రాక్ మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. లాల్‌బాగ్ చేరుకోవడానికి మీరు బెంగళూరులో నడుస్తున్న స్థానిక రవాణాను ఎంచుకుని వెళ్లవచ్చు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. బెంగుళూరు ప్యాలెస్, సమ్మర్ ప్యాలెస్, స్నో సిటీ, క్యూబన్ పార్క్, ఇస్కాన్ టెంపుల్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు లాల్‌బాగ్ చుట్టుపక్కల చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి.




