Telugu News » Photo gallery » Beauty Secrets: Top 5 Celebrity Skin Care Secrets to Get that Glow at Home
Beauty Secrets: హీరోయిన్స్‌లా అందంగా కనిపించాలనుకుంటున్నారా..? అయితే, ఈ బ్యూటీ సీక్రెట్స్ మీకోసమే
Shaik Madarsaheb |
Updated on: Apr 02, 2023 | 2:02 PM
సెలబ్రిటీలా మచ్చలేని చర్మాన్ని పొందడానికి బ్యూటీషియన్‌లు కొన్ని టిప్స్ చెప్తున్నారు. ఈ పద్దతులను అవలంబించడం ద్వారా మీరు కూడా సెలబ్రిటీలా మచ్చలేని, మెరుస్తున్న చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. కావున సెలబ్రిటీల మాదిరిగా మచ్చలేని చర్మాన్ని పొందే ఆ రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Apr 02, 2023 | 2:02 PM
సెలబ్రిటీలా మచ్చలేని చర్మాన్ని పొందడానికి బ్యూటీషియన్‌లు కొన్ని టిప్స్ చెప్తున్నారు. ఈ పద్దతులను అవలంబించడం ద్వారా మీరు కూడా సెలబ్రిటీలా మచ్చలేని, మెరుస్తున్న చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. కావున సెలబ్రిటీల మాదిరిగా మచ్చలేని చర్మాన్ని పొందే ఆ రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1 / 6
అందమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని సొంతం చేసుకోవాలంటే ప్రతిరోజూ రాత్రివేళ తగినంత నిద్ర తీసుకోండి. రాత్రి నిద్రిస్తున్నప్పుడు మీ చర్మంలో కొత్త కొల్లాజెన్ ఉత్పత్తి అవుతుంది. ఇది ఫైన్ లైన్స్, ముడతలను నివారించడంలో సహాయపడుతుంది. అందుకే రాత్రిపూట మంచి నిద్ర అవసరం.
2 / 6
మేకప్ ఉపయోగిస్తే, ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు మేకప్ పూర్తిగా తీసివేయడం ముఖ్యం. అందుకే రోజూ పడుకునే ముందు ముఖం కడుక్కోవాలి. అలాగే మేకప్ ఉంటే.. ఇది మీ చర్మ రంధ్రాలను మూసివేస్తుంది. దీని వలన దురద, దద్దుర్లు, వాపు వంటి సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది.
3 / 6
స్కిన్ హైడ్రేషన్ కోసం మీరు సీజనల్, గ్రీన్ వెజిటేబుల్స్ పుష్కలంగా తీసుకోవాలి. ఇది కాకుండా, తగినంత నీరు తీసుకోవడం శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మీ చర్మానికి లోపలి నుంచి గ్లో, మెరుపును తెస్తుంది. ఇది కాకుండా, కూరగాయలలో ఉండే విటమిన్లు చర్మపు కొల్లాజెన్‌ను పెంచడంలో సహాయపడతాయి.
4 / 6
సన్‌స్క్రీన్ చాలా ముఖ్యమైన ఉత్పత్తి.. ఇది సన్ బర్న్, అకాల వృద్ధాప్యం, ముడతలు, చర్మ క్యాన్సర్ వంటి చర్మ సమస్యల నుంచి మీ చర్మాన్ని రక్షిస్తుంది. అందుకే బయటికి వెళ్లే ముందు రోజూ సన్‌స్క్రీన్ రాసుకోండి.
5 / 6
మీరు మీ చర్మ సంరక్షణలో ఫేస్ మాస్క్‌ను చేర్చుకుంటే.. మీ చర్మం ఎల్లప్పుడూ లోతైన పోషణతో ఉంటుంది. దీని కారణంగా ఏదైనా ఫంక్షన్ సమయంలో మీ చర్మం తాజాగా, మెరుస్తూ కనిపిస్తుంది.