అల్లరి తనం అంటే ఇదే.. అషూ క్యూట్ ఫొటోస్
కొంటెతనం, అందంతో అందరి మనసు దోచుకునే ముద్దుగుమ్మ, బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాలో క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. అవి నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.
Updated on: Oct 13, 2025 | 8:43 PM

అందాల ముద్దుగుమ్మ అషు రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు జూనియర్ సమంతగా మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగు బిగ్గె స్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగు పెట్టింది. అక్కడ తన ఆటతీరుతో అందరినీ మెప్పించి, మంచి ఫేమ్ సంపాదించుకుంది.

రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తర్వాత పలు షోలు, సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సుడిగాలి సుధీర్ తో ఫ్యామిలీ స్టార్ షోలో చేస్తుంది. అంతే కాకుండా వెబ్ సీరీస్‌లు కూడా చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

ఇక అమెరికాలో ఉద్యోగం చేస్తూ సెటిల్ అయిపోయిన ఈ చిన్నది తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ కోసం చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది. తన అందం, అభినయం, చలాకీ తనంతో అందరినీ ఆకట్టుకొని బుల్లితెరపై సందడి చేస్తుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇన్ స్టాలో క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఓ కార్ దగ్గర నిల్చొని, అల్లరి పనులు చేస్తూ, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్ రోడ్డు పై ఏంటీ నీ అల్లరి పనులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.



