- Telugu News Photo Gallery Are the children drinking tea? These things are for you, Check Here is Details
Kids Drink Tea: పిల్లలు టీ తాగుతున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
చాలా మంది టీ తాగుతూ ఉంటారు. టీ తాగితే చాలా రిఫ్రెష్‌గా ఉంటుంది. అయితే పెద్దలతో పాటు ఇంట్లో ఉండే పిల్లలకు కూడా టీ తాగుతామని మారాం చేస్తూ ఉంటారు. కానీ పిల్లలు టీ తాగడం వల్ల అనేక రకాల సమస్యలు రావడం తప్పవు..
Updated on: Nov 29, 2024 | 6:11 PM

టీ అనేది ఒక ఎనర్జీ డ్రింక్ అని చెప్పొచ్చు. టీ తాగడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగని ఎక్కువగా తాగినా అనర్థాల పాలవ్వక తప్పదు. ఉదయాన్నే ఒక కప్పు టీ తాగడం వల్ల చాలా మంచిది. అయితే ఇంట్లో పెద్ద వాళ్లు టీ తాగేటప్పుడు పిల్లలు కూడా టీ తాగుతామని మారాం చేస్తారు.

పిల్లలు ఏడుస్తున్నారని పెద్దలు కూడా టీ ఇస్తూ ఉంటారు. కానీ పిల్లలు టీ తాగకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. టీ ఎక్కువగా తాగడం వల్ల వారు బద్ధకస్తులుగా మారతారు. వారిలో ఎసిడిటీ సమస్య కూడా రావచ్చు.

అంతే కాకుండా మూత్ర విసర్జన సమస్యలను కూడా ఎదుర్కొనాల్సి వస్తుందట. 10 సంవత్సరాల కంటే వయసు తక్కువగా ఉన్న పిల్లలకు టీ ఇవ్వడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా వారిలో నిద్ర సమస్యలు కూడా రావచ్చని అంటున్నారు.

చిన్న పిల్లలు టీ తాగడం వల్ల వారిలో దంత సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. దంతాలు కూడా త్వరగా ఊడిపోతాయి. నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది. టీ తాగడం వల్ల పిల్లల్లో రక్త హీనత సమస్య వస్తుందట.

పిల్లలు టీ తాగడం వల్ల వాళ్లలో ఎముకలు కూడా వీక్‌గా మారతాయి. తలనొప్పి సమస్య కూడా రావచ్చు. టీ తాగే పిల్లలు భోజనం అనేది సరిగా చేయరు. ఆకలి అనేది చచ్చిపోతుంది. కాళ్ల నొప్పులు కూడా వస్తాయి. కాబట్టి చిన్న పిల్లలకు టీ అనేది ఇవ్వకండి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)




