- Telugu News Photo Gallery Applying honey on the face, is it healthy or unhealthy? What do the experts say?
ఫేస్‌పై తేనె అప్లై చేస్తే.. ఆరోగ్యమా.? అనారోగ్యమా.? నిపుణులు మాటేంటి.?
తేనె మన ఆరోగ్యానికి దివ్యౌషధంగా చెప్పొచ్చు..ఇది శరీరానికి హాని చేయదు. శరీర బలాన్ని పెంచుతుంది. రుచికి తియ్యగా ఉండే తేనె.. చర్మ సౌందర్యానికి కూడా అద్భుత ఔషధంగా చెబుతారు. తేనెను ముఖానికి రాసుకుంటే కాంతి పెరుగుతుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తేనె వల్ల చర్మానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ ముఖానికి తేనె అప్లై చేస్తే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Nov 22, 2025 | 12:41 PM

తేనె రుచిలో టేస్టీగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. తేనెను ఉపయోగించి మనం జలుబు నుంచి గొంతు నొప్పి వరకు ఎన్నో సమస్యలను నయం చేసుకోవచ్చు. తేనె గాయాలను కూడా ఈజీగా నయం చేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రాత్రిపూట బాగా నిద్రపట్టేలా చేస్తుంది.

అంతేకాదు..తేనె కేవలం మన ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. తేనెను ఎన్నో రకాల ఫేస్ మాస్క్ ల్లో ఉపయోగిస్తారు. తేనెకున్న ప్రత్యేకత ఏంటంటే.. దీన్ని రోజూ చర్మానికి ఉపయోగించొచ్చు.

తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడుతాయి. ఇది చర్మాన్ని టైట్ గా, యవ్వనంగా ఉంచుతుంది. అలాగే వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. అలాగే ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

తేనె ముఖానికి, మొత్తం చర్మానికి అప్లై చేయడం వల్ల డ్రై స్కిన్ సమస్య తొలగిపోతుంది. చర్మం నీరసంగా మారదు. అలాగే చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. లోపల ఉన్న కొత్త కణాలు బయటకు వచ్చి మీ చర్మం మెరిసెలా చేస్తుంది. తేనెలో ఉండే కొన్ని ఎంజైములు దీనిని నేచురల్ ఎక్స్ఫోలియేటర్ గా చేస్తాయి.

తేనె మన చర్మంపై ఉండే బ్యాక్టీరియాను చాలా వరకు తగ్గిస్తుంది. దీంతో మొఖంపై మొటిమలు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. మొటిమలతో బాధపడుతున్న వారికి తేనె మంచి మందులా పనిచేస్తుంది. మొటిమలకు తేనెను అప్లై చేయడం వల్ల మీ ముఖంపై ఉన్న దుమ్ము, దూళి తొలగిపోతాయి. దీంతో బ్యాక్టీరియా నుంచి మీ ముఖం రక్షణ పొందుతుంది. తేనె మొటిమలకు యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది.




