- Telugu News Photo Gallery Andhra Pradesh: Yoga guru Sadguru Satchidananda Yogi created 9 forms of godess with his abdominal muscle
Sadguru Satchidananda Yogi: యోగాతో నవ రాత్రులు.. నవ దుర్గలు! సద్గురు సచ్చిదానంద యోగి ఖాతాలో మరో అరుదైన రికార్డు
కాకినాడ ఆదిగురు యోగపీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారి తొమ్మిది రూపాలను తన పొట్ట కండరాలపై రూపొందించారు. యోగాలో చెప్పబడిన నౌలి అనే ప్రక్రియతో వివిధ దుర్గ అవతారాలను చిత్రీకరించి చూపించారు. ఇందులో ముఖ్యంగా వారాహి దేవి, కాళీ మాత, అన్నపూర్ణ దేవి, దుర్గ దేవి, ప్రత్యంగిరా దేవి, మహా లక్ష్మీ, సరస్వతీ దేవి, మహిషాసుర మర్థినీ, లలితా త్రిపుర సుందరి దేవి..
Pvv Satyanarayana | Edited By: Srilakshmi C
Updated on: Oct 23, 2023 | 10:40 AM

కాకినాడ ఆదిగురు యోగపీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారి తొమ్మిది రూపాలను తన పొట్ట కండరాలపై రూపొందించారు.

యోగాలో చెప్పబడిన నౌలి అనే ప్రక్రియతో వివిధ దుర్గ అవతారాలను చిత్రీకరించి చూపించారు.

ఇందులో ముఖ్యంగా వారాహి దేవి, కాళీ మాత, అన్నపూర్ణ దేవి, దుర్గ దేవి, ప్రత్యంగిరా దేవి, మహా లక్ష్మీ, సరస్వతీ దేవి, మహిషాసుర మర్థినీ, లలితా త్రిపుర సుందరి దేవి.. ఇలా తొమ్మిది అవతారాలను ప్రదర్శించాడు.

ప్రతిరోజు రోజుకొక్క అవతారాన్ని ఈ విధంగా తొమ్మిది రోజులు తొమ్మిది అమ్మవార్లను తన పొట్టపై చూపించి తన భక్తి భావాన్ని వినూత్నంగా తెలియజేసారు. ఈ ప్రక్రియ చూపర్లను ఎంతో ఆకట్టుకుంది.

తన పొట్టపై చూపిన వివిధ ఆకృతులకు గాను గతంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు.. కాగా తాజాగా నవదుర్గ ఆకృతులతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానాన్ని పొందారు.





























