గతంలో కంటిలో నుంచి ప్లాస్టిక్ పదార్ధాలు, రాళ్ళు రావడం చూశాం గానీ ఈ విద్యార్థిని కంటిలో నుంచి ఏకంగా నల్ల చీమలు వస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం భక్తరహల్లి గ్రామానికి చెందిన నరసయ్య గౌడ్ కుమార్తె కీర్తన కుడి కంటిలో నుంచి నల్ల చీమలు బయటికి వస్తున్నాయని కుటుంబ సభ్యులు కనుగొన్నారు.