- Telugu News Photo Gallery Political photos PM Modi shares glimpses from G20 Gala Dinner hosted by President Droupadi Murmu see photos
G20 Gala Dinner Photos: సందడిగా సాగిన జి 20 గాలా డిన్నర్.. ఫోటోలను షేర్ చేసిన ప్రధాని మోదీ..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి జీ20 దేశాధినేతలకు డిన్నర్ ఇచ్చారు. ఈ విందుకు వచ్చే వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దగ్గరుండి స్వాగతం చెప్పారు. విదేశీ అతిథులతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ విందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు ఇతర నేతలు కూడా హాజరయ్యారు. డిన్న డయాస్ వెనక గోడపై బీహార్ లోని ప్రాచీన నలందా యూనివర్శిటీని చూపించారు. అలాగే వసుధైక కుటుంబం, ఒకటే భూమి, ఒకటే కుటుంబం, ఒకటే భవిష్యత్తు థీమ్ చూపించారు.
Updated on: Sep 11, 2023 | 8:33 PM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందుకు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము , అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌లతో కలిసి ప్రధాని మోదీ హాల్‌లోకి వస్తుండగా .. అదే సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వేగంగా వారి వైపు వెళ్తున్నట్లు చిత్రాల్లో స్పష్టంగా చూడవచ్చు.

G20 విందు క్షణాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దీనిలో అతను జో బిడెన్‌కు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను పరిచయం చేశారు.

అమెరికా ప్రెసిడెంట్‌కు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తోపాటు జార్ఖండ్ సీఎంను కూడా పరిచయం చేశారు. వీరంతా కాసేపు మాట్లాడుకున్నారు.

G20 సమ్మిట్ సందర్భంగా గాలా డిన్నర్‌కు ముందు ప్రపంచ దేశాధినేతలు సరదాగా కాసేపు కలిసి మాట్లాడుకున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ రాజధానిలోని భారత్ మండపంలో రాత్రి భోజ్ పర్ సంవాద్ సందర్భంగా యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి రిషి సునక్‌తో ఆనందాన్ని పంచుకున్నారు. ఇరుదేశాల మధ్య స్నేహాన్ని మరింతగా పెంపొందించేందుకు పరస్పర ప్రయోజనాల అంశాలు, సహకార రంగాలపై వారిద్దరూ చర్చించారు..

జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా తన భార్య యుకో కిషిడాతో కలిసి కనిపించారు. ఆమె అందమైన ఆకుపచ్చ చీర కట్టు, పింక్ బ్లౌజ్‌తో కనిపించారు. భారతీయత ఉట్టిపడేలా కట్టు, బొట్టుతో జి 20 విందులో సందడి చేశారు.

జి 20 గాలా విందులో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భార్య యుకో కిషిడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరిలో కలిసిపోయారు.

బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడుతుండటాన్ని మనం ఇక్కడ చూడవచ్చు.

జీ 20 గాలా డిన్నర్‌లో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ అధ్యక్షుడు అజయ్ బంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

జి 20 గాలా డిన్నర్ సందడిగా సాగింది. అక్కడ ఏర్పాటు చేసిన సంగీత్ అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా భారతీయ ప్రముఖలతోపాటు దేశాధినేతలు సైతం కాసేపు సరదాగా మాట్లాడుకోవడం మనం ఇక్కడ చూడవచ్చు.

గాలా డిన్నర్ సమయంలో కళాకారులు బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగుతుండగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆహ్వానితులతో ఇంటరాక్ట్ అయ్యారు. భారత్ నిర్వహించిన జి 20 సదస్సు, భారత్ అభివృద్ది వంటి అంశాలపై చర్చించారు.

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. భారత్- బంగ్లాదేశ్ మైత్రిని బలోపేతం చేయడంలో ఈ ఇద్దరి మధ్య జరిగిన పలు చర్చలు ఫలించాయి.





























