- Telugu News Photo Gallery Technology photos Huawei launches new smartphone Huawei mate 60 pro features and price details Telugu Tech News
Huawei Mate 60 Pro+: మార్కెట్లోకి మరో కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ అదుర్స్ అంతే..
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ హువావే కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇటీవలే హువావే మేట్ 60, మేట్ 60 ప్రోను లాంచ్ చేసిన టెక్ దిగ్గజం తాజాగా హువావే మేట్ 60 ప్రో+ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం చైనాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత్‌లో లాంచ్ చేయనున్నారు. అయితే దీనిపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇంతకీ హువావే మేట్ 60 ప్రో+లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఏంటి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
Updated on: Sep 11, 2023 | 6:30 PM

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం హువావే తాజాగా టెక్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. హువావే మేట్ 60 ప్రో+ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్ చైనాలో ప్రస్తుతం అందుబాటులోకి రాగా, త్వరలోనే భారత్‌లోకి తీసుకురానున్నారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.82 ఇంచెస్‌తో కూడిన ఎల్పీటీఓ ఓలెడ్ డిస్‌ప్లేను అందించారు. 1.5 కే రిజల్యూషన్ ఈ డిస్‌ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో కూడిన ఈ డిస్‌ప్లేకు కున్‌లన్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు.

హార్మోనీ ఆపరేటింగ్ సిస్టమ్ 4.0 వెర్షన్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 16 జీబీ ర్యామ్, వన్ టిగా బైట్ స్టోరేజ్‌ను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో బ్లూటూత్ 5.2, జీపీఎస్, 2 శాటిలైట్ కమ్యూనికేషన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఆల్ట్రా మాక్రో టెలిఫొటో లెన్స్ విత్ ఓఐఎస్ ఈ రెయిర్ కెమెరా ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 88 వాట్స్ వైర్డ్, 50 వాట్స్ వైర్‌లెస్, 20 వాట్స్ వైర్ లెస్ రివర్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. అలాగే సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను ఇచ్చారు. ధరపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనరాలేదు.





























