- Telugu News Photo Gallery Technology photos Boat launching new smart phone Boat lunar vista features and price details Telugu Tech News
Boat Lunar Vista: బోట్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్.. ఇంత తక్కువ ధరలో ఎన్నో ఫీచర్లు
భారత్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ తయారీ సంస్థ బోట్ కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేస్తోంది. ఇప్పటికే బడ్జెట్ ధరలో అందుబాటులోకి స్మార్ట్ వాచ్‌లను తీసుకొస్తున్న బోట్ తాజాగా బోట్ లూనర్ విస్టా పేరుతో కొత్త వాచ్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. రూ. 2వేల లోపు మంచి ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్ వాచ్ కోసం సెర్చ్ చేస్తున్న వారికి ఈ వాచ్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇంతకి బోట్ లూనర్ విస్టా స్మార్ట్ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
Updated on: Sep 11, 2023 | 7:08 PM

బోట్ లూనర్ విస్టా పేరుతో మార్కెట్లోకి కొత్త వాచ్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ స్మార్ట్ వాచ్‌ను సెప్టెంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.52 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. 360 x 360 పిక్సెల్ రిజల్యూషన్, 550 నిట్స్ బ్రైట్‌నెస్ ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఈ వాచ్ 'ఆల్‌వేస్ ఆన్ డిస్‌ప్లే' అనే ఫీచర్ సపోర్ట్ చేసింది.

బోట్ లూనర్ విస్టా స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌తో పని చేస్తుంది. దీంతో ఎంచక్కా కాల్స్ ఫోన్‌లోనే మాట్లాడుకోవచ్చు. 100కిపైగా వాచ్ ఫేస్‌లకు ఈ స్మార్ట్ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

ఇక ఇందులో ఎస్‌పీఓ2 మానిటరింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, మెనుస్ట్రుయల్ సైకిల్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, క్యాలరీ ట్రాకింగ్‌తో పాటు 100కిపైగా స్పోర్ట్స్ మోడ్స్ వంటి ఫీచర్లను అందించారు.

ఈ వాచ్ బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 10 రోజులు పనిచేస్తుంది. అలాగే ఇందులో ఐపీ68 డస్ట్, వెట్ రెసిస్టెంట్ వంటి ఫీచర్స్‌ను అందించారు. ధర విషయానికొస్తే రూ. 1,999గా నిర్ణయించారు. కెమెరా కంట్రోల్, ఫైండ్ మై ఫోన్, వెదర్, స్టాప్‌వాచ్, కౌంట్‌డౌన్ టైమర్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ వాచ్ సొంతం.





























