అశ్వగంధ టీ తయారీ కోసం ఒక కప్పు నీరు, అర టీస్పూన్ అశ్వగంధ పొడి, పావు టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, పావు టీస్పూన్ యాలకుల పొడి, చిటికెడు అల్లం ముక్క, రుచికి తగినంత తెనేను తీసుకోవాలి. ఒక చిన్న పాత్రలో నీటిని మరిగించుకోవాలి.. మరిగే నీటిలో అశ్వగంధ పొడి, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి, అల్లం ముక్క వేసి బాగా కలుపుకోవాలి. మిశ్రమాన్ని మరో 2-3 నిమిషాలు మరిగించండి. బాగా మరిగిన నీటిని వడకట్టి ఒక కప్పులోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి రుచికి తగినంత తేనె కలిపి వెచ్చగా తాగేయాలి.