- Telugu News Photo Gallery Amazing Health Benefit of Hibiscus Flower, check here is details in Telugu
Hibiscus Flower: మందార పువ్వును ఇలా తిన్నారంటే.. ఈ వ్యాధులన్నీ మాయం!
మందార పువ్వు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ ఈ పువ్వుల గురించి తెలుసు. మందరా పువ్వుల విరివిగా లభిస్తూ ఉంటాయి. వీటిల్లో అనేక రంగులు కూడా ఉంటాయి. మందార పువ్వులే కాకుండా.. ఆకుల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఎక్కువగా జుట్టు సమస్యలు తగ్గించుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మందార పువ్వులను తింటే.. ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన పరిశోధనల్లో..
Updated on: May 09, 2024 | 6:33 PM

మందార పువ్వు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందరికీ ఈ పువ్వుల గురించి తెలుసు. మందరా పువ్వుల విరివిగా లభిస్తూ ఉంటాయి. వీటిల్లో అనేక రంగులు కూడా ఉంటాయి. మందార పువ్వులే కాకుండా.. ఆకుల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి.

వీటిని ఎక్కువగా జుట్టు సమస్యలు తగ్గించుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మందార పువ్వులను తింటే.. ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

రోజూ ఒక మందార పువ్వును తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయట. మందరా పువ్వుల్లో ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, హెల్దీ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్, క్యాల్షియం వంటివి విరివిగా లభిస్తాయి.

రోజూ ఒక మందరా పువ్వు తింటే ఎంతో ప్రమాదకర వ్యాధి అయిన క్యాన్సర్‌ను తగ్గించుకోవచ్చు. మందార పువ్వు టీ తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరిగి.. అధిక బరువు కూడా తగ్గుతారు. జీర్ణ సమస్యలు తగ్గి.. జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. గ్యాస్, ఎసిడిటీ కూడా కంట్రోల్ అవుతాయి.

ముఖ్యంగా కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయం నుంచి విషాన్ని బయటకు పంపి.. క్లీన్ చేస్తుంది. రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. బీపీ, షుగర్ వంటివి కూడా నియంత్రణలో ఉంటాయి.




