- Telugu News Photo Gallery Cinema photos Rajamouli wants to make an animation film and Trisha to enter Bollywood after 15 years
యానిమేషన్ సినిమా చేయాలని ఉంది రాజమౌళి.. 15 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి త్రిష
హాలీవుడ్ దర్శకుల్లా తనక్కూడా పూర్తి యానిమేషన్ సినిమా చేయాలని ఉంది అని అన్నారు ఎస్. ఎస్. రాజమౌళి. భవిష్యత్తులో చేసే అవకాశం వచ్చినప్పుడు బాహుబలి సీరీస్ ద్వారా నేర్చుకున్న అంశాలు తనకు కచ్చితంగా ఉపయోగపడతాయని అన్నారు. ఏ ప్రాజెక్ట్ మొదలుపెట్టినా, అది కొత్త ఆడియన్స్ కి ఎలా చేరువవుతుందా అని ఆలోచిస్తానని చెప్పారు జక్కన్న. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్య. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లయిన సందర్భంగా 'ఆర్యా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్' నిర్వహించుకున్నారు యూనిట్ సభ్యులు.
Updated on: May 09, 2024 | 6:51 PM

Rajamouli: హాలీవుడ్ దర్శకుల్లా తనక్కూడా పూర్తి యానిమేషన్ సినిమా చేయాలని ఉంది అని అన్నారు ఎస్. ఎస్. రాజమౌళి. భవిష్యత్తులో చేసే అవకాశం వచ్చినప్పుడు బాహుబలి సీరీస్ ద్వారా నేర్చుకున్న అంశాలు తనకు కచ్చితంగా ఉపయోగపడతాయని అన్నారు. ఏ ప్రాజెక్ట్ మొదలుపెట్టినా, అది కొత్త ఆడియన్స్ కి ఎలా చేరువవుతుందా అని ఆలోచిస్తానని చెప్పారు జక్కన్న.

Arya: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్య. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లయిన సందర్భంగా 'ఆర్యా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్' నిర్వహించుకున్నారు యూనిట్ సభ్యులు. హైదరాబాద్‌లో ఈ ఈవెంట్ కలర్‌ఫుల్‌గా జరిగింది. యూనిట్ అంతా పాల్గొని తమ ఆనందాన్ని, ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

Aryan Khan: ఆర్యన్‌ఖాన్ తన డైరక్టోరియల్ డెబ్యూట్ ప్రాజెక్టును ఈ నెలాఖరుకు పూర్తి చేయనున్నారు. స్టార్‌డమ్ అనే వెబ్‌సీరీస్ చేస్తున్నారు ఆర్యన్‌ఖాన్. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతోంది. గతేడాది జూన్‌లో స్టార్ట్ అయింది ఈ సీరీస్. ఇందులో షారుఖ్ ఖాన్, రణ్‌బీర్ కపూర్, రణ్‌వీర్‌సింగ్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు నటిస్తున్నట్టు ముంబై టాక్.

Kesariya: మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ స్పాటిఫై వేదికగా రికార్డులు బద్ధలు కొట్టింది బ్రహ్మాస్త్ర సినిమాలోని కేసరియా సాంగ్. ఈ ప్లాట్‌ఫార్మ్ లో 500 మిలియన్ల స్ట్రీమింగ్ దాటిన తొలి పాటగా రికార్డు క్రియేట్ చేసింది. యూట్యూబ్‌లోనూ మంచి రికార్డుల్ని క్రియేట్ చేసింది ఈ పాట. రణ్‌బీర్ కపూర్, ఆలియా నటించిన సినిమా బ్రహ్మాస్త్ర. వచ్చే ఏడాది పార్ట్ 2 పనులు స్టార్ట్ కానున్నాయి.

ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ రెడీ అయిందట. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి కేరక్టర్ చేయడానికి త్రిషని ఫస్ట్ చాయిస్‌గా అనుకుంటున్నారట. ఇప్పుడు త్రిష ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవేళ ఆమె కాల్షీట్లు కుదరని పక్షంలో నయనతార ఈ కేరక్టర్‌కి సెట్ అవుతారనే మాటలు వినిపిస్తున్నాయి.




