- Telugu News Photo Gallery Cinema photos Prithviraj says that character in Salaar is very special and Janhvi Kapoor serious on netizens for this
సలార్‌లో ఆ కేరక్టర్ చాలా స్పెషల్ అంటున్న పృథ్విరాజ్ | నెటిజన్స్ పై జాన్వీ కపూర్ సీరియస్..
ఆర్య సినిమాకు 125 రోజుల షీల్డ్ తీసుకోకపోతే తన పేరు మార్చుకుంటానని అన్నారట అల్లు అర్జున్. అన్నట్టుగానే చిరంజీవిగారి చేతుల మీదుగా షీల్డ్ అందుకున్నానని గుర్తుచేసుకున్నారు. ఆర్య టైమ్‌లో టీమ్ అందరూ కొత్తవారని అన్నారు బన్నీ. సుకుమార్ బాగా డైరక్ట్ చేస్తారని వినాయక్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ మర్చిపోలేనని చెప్పారు. సలార్‌లో శివ మన్నార్ కేరక్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు నటుడు పృథ్విరాజ్ సుకుమారన్.
Updated on: May 09, 2024 | 7:00 PM

Allu Arjun: ఆర్య సినిమాకు 125 రోజుల షీల్డ్ తీసుకోకపోతే తన పేరు మార్చుకుంటానని అన్నారట అల్లు అర్జున్. అన్నట్టుగానే చిరంజీవిగారి చేతుల మీదుగా షీల్డ్ అందుకున్నానని గుర్తుచేసుకున్నారు. ఆర్య టైమ్‌లో టీమ్ అందరూ కొత్తవారని అన్నారు బన్నీ. సుకుమార్ బాగా డైరక్ట్ చేస్తారని వినాయక్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ మర్చిపోలేనని చెప్పారు.

Salar: సలార్‌లో శివ మన్నార్ కేరక్టర్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు నటుడు పృథ్విరాజ్ సుకుమారన్. ప్రశాంత్ నీల్ తనకు చెప్పిన అన్ని పాత్రల్లోకీ శివ మన్నార్ కేరక్టర్ చాలా స్పెషల్ అని అన్నారు. మరో సినిమాటిక్ యూనివర్శ్‌తో ఈ కేరక్టర్‌కి అద్భుతమైన లింక్ ఉంటుందని అన్నారు. త్వరలోనే సలార్ సీక్వెల్ షూటింగ్ మొదలుకానుంది.

Nayanthara: నయనతార నాయికగా నటిస్తున్న సినిమా డియర్ స్టూడెంట్స్. నివిన్ పాలీ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ విషయాన్ని నయన్ తన ఫ్యాన్స్ తో పంచుకున్నారు. కాలేజీ పిల్లల చుట్టూ తిరిగే కథనంతో సినిమా సాగుతుందని చెప్పారు లేడీ సూపర్‌స్టార్.

కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆయనకు ఎలా నటించాలో తెలియదని పలువురు విమర్శించారు. ఇప్పుడు రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం అందుకుందని తెలుస్తోంది.

Manchu Vishnu: తెలుగు సినిమా వైభవాన్ని, వారసత్వ పరంపరని చాటి చెప్పేలా 90 ఏళ్ల వేడుకని నిర్వహిస్తామని అన్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. జులై 20న కౌలాలంపూర్, బుకిట్ జలీల్‌లోని నేషనల్ స్టేడియంలో ఈ వేడుకలు జరుగుతాయని అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌తో పాటు మలేషియా టూరిజం, ఎం.సి.ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో ఈ వేడుకలు జరుగుతాయని అన్నారు.




