తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ మంచి బిజీగా ఉన్న సమయంలోనే తన స్నేహితుడు ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకుంది. వీరికి పాప జన్మించింది. కూతురు పుట్టిన తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రణీత ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. బుల్లితెరపై పలు రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది.