AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yellow Watermelon: ఎర్రగా కాదు.. పసుపుపచ్చగా.. రుచిలో అమృతం! పచ్చ పుచ్చకాయలను ఎప్పుడైనా తిన్నారా?

ఈ ఏడాది దేశవ్యాప్తంగా వేసవికి ముందే ఎండలు విజృంభిస్తున్నాయి. దీంతో అప్పుడే మార్కెట్‌లో పుచ్చకాయలు ప్రత్యక్షమయ్యాయి. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి జనం చలచల్లని పుచ్చకాయను తింటూ సేదతీరుతున్నారు. మీరు ఇప్పటి వరకూ ఎర్రగా పండిన తియ్యని పుచ్చకాయలను మాత్రమే చూసి ఉంటారు. కానీ పసుపు పుచ్చకాయను ఎప్పుడైనా చూశారా? మీ సమాధానం లేదు, అయితే ఈ రోజు వాటి గురించి మీరు తప్పక తెలుసుకోవాలి..

Srilakshmi C
|

Updated on: Mar 14, 2024 | 8:58 PM

Share
మహిళల్లో అధికంగా వచ్చే అనారోగ్య సమస్యల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్యమైనది. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు తీసుకునే అనేకానేక చర్యల్లో ఆహారం ఒకటి. సరైన ఆహారం తింటే శరీరంలో క్యాన్సర్‌ కారకాలు ఉత్పత్తి కాకుండా నివారించవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారించే ఆహారాల్లో పుచ్చకాయ ముఖ్యమైనది. ఇది రుచికి ఎంత కమ్మగా ఉంటుందో, దాని వల్ల చాలా ప్రయోజనాలు కూడా అంతే అధికంగా ఉన్నాయి.

1 / 5
పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఈ పండు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వివిధ వ్యాధులను దూరం చేస్తాయి పుచ్చకాయ క్యాన్సర్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ (కణాలను నాశనం చేసే క్రియాశీల అణువులు) తొలగించడంలో సహాయపడతాయి. అందుకే పుచ్చకాయ వివిధ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.

2 / 5
తమిళనాడులోని తేని జిల్లాలో ఇలాంటి పసుపు రంగు పుచ్చకాయలు మీకు కనిపిస్తాయి. తేని జిల్లాలో గంపం చిన్నమనూరు, కడలూరుతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి పుచ్చకాయలను పండిస్తున్నారు. ఎండాకాలం వచ్చిందంటే పుచ్చకాయలు అమ్మేవారు రోడ్డుపక్కన దుకాణాల్లో ఇలాంటి పసుపు పుచ్చకాయలను అమ్ముతూ కనిపిస్తారు. మార్చి నుంచే అన్ని చోట్లా వీటి విక్రయాలు ప్రారంభమయ్యాయి.

3 / 5
పుచ్చకాయలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజూ పుచ్చకాయ తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దృష్టి మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఈ సీజనల్ వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కళ్లను రక్షిస్తుంది.

4 / 5
ఈ కొత్త రకం పుచ్చకాయలను సాగు చేయడం వల్ల స్థానిక రైతుల ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు. పసుపు పుచ్చకాయలో విటమిన్-బి, విటమిన్-ఎ, సి, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, బీటా-కెరోటిన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఇది ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.

5 / 5