సిగ్గుపడకే పిల్లా.. చీరలో అందంగా ఐశ్వర్యా రాజేష్
ట్రెడిషనల్ లుక్‌లో కనిపిస్తూ తన అందంతో అందరినీ మాయ చేస్తున్న చిన్నది ఐశ్వర్యా రాజేష్ . ఈ అమ్మడు గురించి ఎంత చెప్పినా తక్కవే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. సంక్రాంతి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిన్నది ఈ మూవీ తర్వాత గ్లామర్ డోస్ పెంచింది. వరసగా ఫొటో షూట్స్‌తో అందరి మతి పొగొడుతుంది. తాజాగా సింపుల్ చీరలో అదరిపోయే లుక్‌లో దర్శనం ఇచ్చింది. మరి మీరు కూడా ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.
Updated on: Aug 05, 2025 | 10:44 PM

ముద్దుగుమ్మ ఐశ్వర్యా రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అనిల్ రావుపూడీ దర్శకత్వంలో స్టార్ హీరో వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.చాలా సినిమాల్లో నటించినప్పటికీ, ఈ బ్యూటీకిమాత్రం సంక్రాంతికి వస్తున్నాం మూవీతో మంచి క్రేజ్ వచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

తమిళంలో వరస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, కౌసల్యా కృష్ణ మూర్తి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత ఈ చిన్నది చాలా సినిమాల్లో నటించింది. వరల్డ్ ఫేమస్ లవ్ వంటి చాలా మూవీస్‌లో నటించినప్పటికీ, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతోనే తెలుగుఅభిమానులకు ఎక్కువగా దగ్గరైంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగింటి గృహిణి పాత్రల్లో నటిస్తూ.. తెలుగు అభిమానుల మనసు దోచేస్తుంది ఈ చిన్నది. అంతే కాకుండా వరసా ఆఫర్స్ అందుకుంటూ తన అందచందాలతో కుర్రకారును తన వైపుకు లాక్కుంటుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ తన వరస ఫొటో షూట్స్‌తో అభిమానులను అట్రాక్ట్ చేసుకుంటుంది. తాజాగా చీరలో చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది.

చీరకట్టులో సింపుల్ లుక్‌లో తన అందాలతో రచ్చ చేసింది. ప్రస్తుం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వీటిని చూసిన తన ఫ్యాన్స్ అచ్చం తెలుగు అమ్మాయిలా చూడటానికి చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.



