- Telugu News Photo Gallery Adhikmaas amavasya 2023: dont do these mistakes on this amavasya tithi or precautions Telugu News
Adhik Maas Amavasya 2023: అధికమాసం అమావాస్య చాలా విశిష్టమైనది.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి..
Adhika Masam Amavasya 2023: ఈ సంవత్సరం 16 ఆగస్టున వచ్చే అమావాస్యకు చాలా విశిష్టత ఉంది. ఇది అధికమాస అమావాస్యగా చెబుతారు. అమావాస్య రోజున శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల మంచి జరుగుతుందని నమ్మకం. అంతేకాదు.. ఈ రోజు శని దేవుడిని పూజించటం వల్ల శని సడే సతి సమస్యలు తొలగి పోతాయని, శని సడే సతి నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Updated on: Aug 15, 2023 | 5:31 PM

ఈసారి అధికామాసం అమావాస్య ఆగస్టు 16 బుధవారం రోజున వచ్చింది. దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఈ అమావాస్య వచ్చింది. సనాతన ధర్మంలో, అమావాస్య రోజున పూర్వీకులను పూజించడం మంచిదని భావిస్తారు. ఈరోజు చేసే శ్రాద్ధ కర్మలకు, తర్పణం, దానాలకు పూర్వికులు తృప్తి పడతారని నమ్మకం.

అధికమాసంలో వచ్చే ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనదని చెబుతారు. ఎందుకంటే ఇలాంటి రోజు సుమారు 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అధికమాసంలోని అమావాస్య రోజున శివుడు, విష్ణువులను పూజిస్తారు. అధికమాసంలోని అమావాస్య నాడు ఏయే దోషాలను నివారించాలో తెలుసుకుందాం.

అధికమాసం అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి తొలి పూజ గణపతిని పూజించాలి. ఆ తరువాత ఇష్ట దేవుడిని పూజించాలి. పొరపాటున కూడా పూజ చేసే ముందు ఆహారం తీసుకోకూడదు.

అమావాస్య రోజున దుష్ట శక్తులు చురుగ్గా ఉంటాయని నమ్ముతారు. కాబట్టి ఈ రోజున దహన సంస్కారాలు, నిర్జన ప్రదేశాల గుండా వెళ్లకూడదు. మినుములు, బెల్లం, నెయ్యి వంటి పదార్థాలను దానంగా ఇచ్చి పూర్వీకులను తలుచుకుని ధ్యానం చేస్తే మంచి కలుగుతుందంటారు.

అధికమాసం అమావాస్య రోజున ఏ పేదవాడిని అవమానించకూడదు, ఎవరినీ ఉద్దేశించి తప్పుడు మాటలు వాడకూడదు. అలాగే అమావాస్య రోజు చీపురు కొనడం కూడా మంచిది కాదు. ఇలా చేస్తే లక్ష్మి దేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని నమ్ముతారు.. అమావాస్య ఘడియల్లో ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం, మత్తు పదార్ధాలు తినటం మంచిది కాదు.





























