- Telugu News Photo Gallery Natural Hair Colour: Use this kitchen spice and discarded fruit peel to turn your hair black
Natural Hair Colour: నెరిసిన జుట్టుకు రంగులు వేస్తున్నారా.. ఇలా చేస్తే సహజంగా నల్లపు రంగులోకి మారిపోతాయి..
Home Remedies: తెల్ల జుట్టును దాచడానికి లేదా జుట్టుకు కొత్త రూపాన్ని ఇవ్వడానికి.. మనలో చాలా మంది హెయిర్ కలర్ వేసుకోవడానికి ఇష్టపడతారు. ఇందుకోసం పార్లర్‌కి వెళ్లడం లేదా మార్కెట్‌లో లభించే హెయిర్ కలర్‌ని తెచ్చి ఇంట్లోనే జుట్టుకు రంగులు వేసుకుంటారు. అయితే మార్కెట్‌లో లభించే రంగులు జుట్టు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. దీనికి కారణం వాటిలో వాడే రసాయనమేనని భావిస్తున్నారు. మీరు మీ జుట్టును డ్యామేజ్ నుండి కాపాడుతూ.. ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రకృతిలో లభించేవాటితో కూడా రంగులు తయారు చేసుకోవచ్చు..
Sanjay Kasula | Edited By: Ravi Kiran
Updated on: Aug 15, 2023 | 10:11 PM

ఈ రోజుల్లో చాలా మందికి జుట్టు త్వరగా నెరసిపోతుంది. చిన్న వయసులో మీ జుట్టు నెరిసిపోతే.. అది అస్సలు బాగుండదు.

చాలా మంది వ్యక్తులు నెరిసిన జుట్టును కూడా స్టైల్‌గా మార్చుకుంటారు. అలా కృత్రిమంగా వేసుకున్న రంగులతో నల్లటి జుట్టు అస్సలు బాగుండదు. అందుకే చాలా మంది గ్రే హెయిర్‌ని దాచుకోవాలనుకుంటారు.

హెయిర్ డైయింగ్, హెన్నా వేసుకుంటారు. ఇది తాత్కాలిక సమస్యను పరిష్కరిస్తుంది. హెన్నా వల్ల జుట్టు రాలిపోతుంది.

జుట్టుకు రంగు వేయడం మంచిది కాదు. ఇందులో జుట్టును డ్యామేజ్ చేసే రసాయనాలు చాలా ఉన్నాయి. దీంతో జుట్టు మరింత తెల్లబడుతుంది.

అందుకే ఈ హోం ట్రిక్ కోసం వెతుకుతున్నాం.. రెగ్యులర్‌గా ఈ ట్రిక్ పాటిస్తే జుట్టు నల్లగా మెయింటైన్ అవుతుంది.

దానిమ్మను కోయడం వల్ల చేతులు నల్లగా మారుతాయి. ఎందుకంటే దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటుంది. దానిమ్మ పై తొక్క ఉపయోగించండి.

దానిమ్మతొక్క, 2 లేదా 3 ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి, ఒక చెంచా మెంతులను ఒక గ్లాసు నీటిలో 10 నిమిషాలు నానబెట్టండి. తర్వాత మూత పెట్టి తక్కువ వేడి మీద మరిగించాలి.

ఇప్పుడు చల్లార్చి స్టయినర్‌లో వడకట్టాలి. ఈ రసం మాత్రమే అవసరం. ఇప్పుడు దీన్ని జుట్టు మూలాలపై బాగా అప్లై చేయండి. ఒక గంట పాటు అలాగే ఉంచి షాంపూతో పూయాలి. ఈ విధంగా మీ జుట్టు సహజ నలుపు రంగును పొందుతుంది. దీంతో పాటు జుట్టు కూడా దృఢంగా ఉంటుంది.





























