- Telugu News Photo Gallery A permanent solution to the problem of excessive scalp hair loss is the paste of shikakai Telugu Lifestyle News
Hair Care Tips: హెయిర్ లాస్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఈ పదార్ధం.. అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే..
ప్రస్తుతం ఆడ, మగ, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. హెయిర్ ఫాల్, చుండ్రు, నెరిసిన జుట్టు వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బందిపెడుతున్నాయి. దాంతో ప్రజలు వివిధ మార్కెట్ ఉత్పత్తులను ఆశ్రయిస్తున్నారు. దాంతో ఫలితం లేకపోగా, సైడ్ ఎఫెక్ట్స్ కూడా వెంటాడుతున్నాయి. అయితే, జుట్టు సంబంధిత సమస్యల నుండి మీ జుట్టును రక్షించుకోవడానికి సులభమైన రెమెడీస్ చెప్పబోతున్నాం.. ఎలాంటి ఖర్చు లేకుండా ఈ హోం రెమెడీతో తక్కువ సమయంలో మంచి ఫలితాలను పొందవచ్చు..
Updated on: Mar 18, 2024 | 8:19 PM

జుట్టు కోసం షీకాకాయి.. అద్భుత హోం రెమిడీగా పనిచేస్తుంది. షీకాకాయి, జుట్టు, తల చర్మం ఆరోగ్యంగా ఉంచటానికి పూర్వ కాలం నుండి ఉపయోగించబడుతున్న మూలికలలో ఒకటి. షీకాకాయి మీ జుట్టుకు బహుళ ప్రయోజనాలను అందిస్తుంది. స్కాల్ప్ హెయిర్ లాస్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

షీకాకాయి జుట్టు సమస్యలకు ఒక అద్భుతమైన సహజ ప్రక్షాళనలాగా పనిచేస్తుంది. దీనిలో ఏ విధమైన రసాయనాలు ఉండవు కాబట్టి మీ చర్మం రసాయనాలను పీల్చదు. దాంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. జుట్టు సమస్యలకు సబ్బులు, షాంపోల కంటే షీకాకాయి, కుంకుడు కాయ మేలు చేస్తుంది.

షీకాకాయిలో తక్కువ స్థాయిలో pH స్థాయిలో ఉంటుంది. దీని తేలికపాటి లక్షణం సున్నితమైన చర్మం కలిగిన వారికి కూడా సరిపోతుంది. ఇది తల చర్మం పొడిగా తయారు కానివ్వదు. జుట్టును మృదువుగా చిక్కులు పడనివ్వకుండా ఒక మంచి డిటాన్గ్లార్ గా పనిచేస్తుంది. అందువలన, మీరు షీకాకాయి ఉపయోగించిన తర్వాత జుట్టు కోసం ప్రత్యేక కండీషనర్ వాడనవసరం లేదు.

షీకాకాయిలో విటమిన్లు D మరియు C. వంటి పోషకాలను జుట్టుకు అందిస్తుంది. ఇది ఇతర మూలికలతో, సహజ పదార్దాలతో బాగా మిళితం అయి, జుట్టుకు మంచి ఆరోగ్యలాభం చేకూరుస్తుంది. షీకాకాయి చుండ్రు రాకుండా సహాయపడుతుంది. జుట్టు రంగు వేసుకునే ముందు, షీకాకాయితో తలంటి స్నానం చేయండి. ఇలా చేయటం వలన జుట్టుకు రంగు బాగా పడుతుంది. చాలా రోజులు రంగు ఉండడానికి సహాయపడుతుంది.

ఉసిరి ఆరోగ్యం మరియు అందం కోసం అనేక ప్రయోజనాలను చేకూర్చే పనులు ఉపయోగపడుతుంది. జుట్టు పల్చబడడాన్ని ఎదుర్కోవడానికి, మీ జుట్టును షాంపూ చేయడానికి ఉసిరిక పొడిని ఉపయోగించండి. జుట్టుకు ఆమ్లా ప్రయోజనాలను ఎక్కువగా ఉపయోగించుకోవడానికి మీరు ప్రత్యామ్నాయంగా దీనిని హెయిర్ టానిక్‌గా ఉపయోగించవచ్చు. శీకాయ అనేది బలమైన మరియు మందమైన జుట్టు కోసం ఉపయోగించే మరొక సహజమైన అద్భుత పదార్ధం. శీకాయ పొడి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి మరియు జుట్టు రాలడాన్ని నివారించడానికి కూడా ఉపయోగించవచ్చు.




