- Telugu News Photo Gallery Technology photos List of best smartphones launching this weekend check here for full details
Smartphones: కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? మార్కెట్లోకి వస్తున్న నయా మాల్ ఇదే..
స్మార్ట్ ఫోన్‌లో టెక్నాలజీ రోజురోజుకీ మారుతోంది. కంపెనీలు రోజుకో కొత్త ఫీచర్‌తో ఫోన్‌లను తీసుకొస్తున్నారు. దీంతో పాత ఫోన్‌లు బాగా పనిచేస్తున్న అప్‌డేటేడ్ ఫీచర్ల కోసం యూజర్లు కొత్త ఫోన్‌లవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లోకి లాంచ్ కావడానికి సిద్ధమవుతోన్న కొత్త ఫోన్‌లపై ఓ లుక్కేయండి...
Updated on: Mar 18, 2024 | 8:34 PM

ఈ నెలలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలైన సామ్‌సంగ్, పోకో, ఐకూ మార్కెట్లోకి కొత్త ఫోన్‌లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ వారం మొత్తం 4 కొత్త ఫోన్‌లు మార్కెట్లోకి వస్తున్నాయి. మరి ఈ ఫోన్‌ల ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి..

Galaxy A35 5G: సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ35 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇందులో exynos 1480 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇందులో కూడా 50 మెగాపిక్సెల్స్ కూడిన రెయిర్ కెమెరాను అందిస్తున్నారు. ధర విషయానికొస్తే రూ. 30,999గా ఉండనుంది.

iQOO Z9 5G: ఐక్యూ నుంచి లాంచ్ అవుతోన్న మరో కొత్త ఫోన్ ఐక్యూ జెడ్9 ఫోన్ ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఇందులో 50 మెగాపిక్సెల్స్ కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఇందులో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు బేస్ వేరియంట్ ధర రూ. 19,999గా ఉండనుంది.

POCO X6 Neo 5G: త్వరలో మార్కెట్లోకి వస్తున్న మరో కొత్త ఫోన్ పోకో ఎక్స్6 నియో 5జీ. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. ఇందులో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు.

Samsung Galaxy A55: ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ స్క్రీన్ సొంతం. ఇందులో exynos 1480 ప్రాసెసర్‌ను అందించారు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాను అందించనున్నారు. ధర విషయానికొస్తే ప్రారంభ వేరియంట్ రూ. 39,999గా ఉంది.




