- Telugu News Photo Gallery Technology photos Flipkart offering 80 percent discount on smartwatch, Check here for full detials
Smart watches: 70 శాతం డిస్కౌంట్‌తో, కళ్లు చెదిరే ఫీచర్లతో.. అదిరిపోయే స్మార్ట్ వాచ్‌లు..
ప్రస్తుతం స్మార్ట్ వాచ్ వినియోగం భారీగా పెరిగింది. ఒకప్పుడు భారీ ధర పలికిన స్మార్ట్ వాచ్‌లు కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని ఫోన్‌లపై ఏకంగా 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. అలాంటి కొన్ని స్మార్ట్ వాచ్‌లు, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Mar 19, 2024 | 8:13 PM

boAt Storm Call: బోట్ స్ట్రోమ్ కాల్ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా 80 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 7499కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 1499కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.83 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇచ్చారు. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. 100కిపై క్లౌడ్ వాచ్ ఫేస్‌లను అందించారు.

Boult Crown: బౌల్ట్ క్రౌన్ స్మార్ట్ ఫోన్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను అందించారు. ఇందులో 1.95 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఈ వాచ్‌ను 66 శాతం డిస్కౌంట్‌తో రూ. 1499కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఎస్‌పీఓ2, బ్లూడ్ మానిటరింగ్, ఆక్సిజన్ శాచురేషన్, హెల్త్ మానిటరింగ్ ఫీచర్‌ను అందించారు.

Boult Drift+: బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 1.85 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో ఎస్‌పీఓ2తో పాటు మరెన్నో హెల్త్ ఫీచర్లను అందించారు. 24*7 హార్ట్ రేట్ మానిటరింగ్ ఫీచర్‌ను అందించారు.

Fire-Boltt Rise: ఫైర్ బోల్ట్ రైస్ స్మార్ట్ వాచ్‌పై ఏకంగా 88 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 1399కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.85 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. వాయిస్ అసిస్టెంట్‌ను ఇచ్చారు. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను అందించారు.

Hammer Ultra Classic: హామ్మర్ అల్ట్రా క్లాసిక్ స్మార్ట్ వాచ్‌పై 71 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 1699కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 2.01 ఇంచెస్ కూడిన స్క్రీన్‌ను అందించారు. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, టచ్ స్క్రీన్‌ను అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే నాన్‌స్టాప్‌గా 5 రోజులపాటు పనిచేస్తుంది.




