spotify: యూట్యూబ్‌కు చెక్ పెట్టే దిశగా స్పాటిఫై అడుగులు.. ఇకపై..
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీడియో కంటెంట్ అందించే యూట్యూబ్‌కు ఇప్పుడు స్పాటిఫై పోటీనిచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆడియో స్ట్రీమింగ్కే పరిమితం కాకుండా వీడియోలు కూడా స్ట్రీమ్ అయ్యే ఫీచర్‌ను తెస్తున్నట్లు సమాచారం..
Spotify
Follow us
ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ స్పాటిఫై యూజర్లను పెంచుకునే దిశగా మరో అడుగు ముందుకేసింది. యూట్యూబ్‌కు పోటీగా కొత్త సేవలను తీసుకొచ్చే పనిలో పడినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు కేవలం మ్యూజిక్ స్ట్రీమింగ్కు మాత్రమే పరిమితమైన స్పాటిఫైలో ఇకపై మ్యూజిక్ వీడియోలను కూడా చూడడానికి వెసులుబాటు కల్పించనున్నారు. ఈ దిశగా స్పాటిఫై ఇప్పటికే వర్కవుట్ చేస్తుంది.
ప్రస్తుతం మ్యూజిక్ వీడియో ఫీచర్ టెస్టింగ్ స్టేజ్‌లో ఉండగా త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ కొత్త ఫీచర్‌ను కొంతమంది ప్రీమియం బీటా వినియోగదారుల కోసం విడుదల చేసింది.
ఏవైనా లోపాలు ఉంటే సవరించి అందరు యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కంపెనీ సన్నహాలు చేస్తోంది. అయితే స్పాటిఫైలో కేవలం మ్యూజిక్ వీడియోలు మాత్రమే ప్లే అవుతాయని సమాచారం.
యూజర్ బేస్‌ను పెంచుకునేందుకు స్పాటిఫై కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల యూజర్ల మార్కును దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి స్పాటిఫై తెస్తున్న ఈ కొత్త ఫీచర్ నిజంగానే యూట్యూబ్‌కు పోటీనిస్తుందో లేదో చూడాలి.