Healthy Food: తెల్ల అన్నం Vs బ్రౌన్‌ రైస్‌.. వీటిల్లో ఏది తింటే ఆరోగ్యానికి మంచిది?

దక్షిణాదిన దాదాపు అందరి ఇళ్లల్లో తెల్ల బియ్యం అన్నం ఎక్కువగా తింటారు. కొంచెం ఆరోగ్య స్పృహ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారు మాత్రం వైట్ రైస్‌కి బదులు బ్రౌన్ రైస్ తినడం ప్రారంభిస్తారు. నిజానికి తెల్ల బియ్యం అన్నంకంటే బ్రౌన్ రైస్ అన్నం తింటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బ్రౌన్ రైస్‌లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

Srilakshmi C

|

Updated on: Feb 26, 2024 | 12:24 PM

దక్షిణాదిన దాదాపు అందరి ఇళ్లల్లో తెల్ల బియ్యం అన్నం ఎక్కువగా తింటారు. కొంచెం ఆరోగ్య స్పృహ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారు మాత్రం వైట్ రైస్‌కి బదులు బ్రౌన్ రైస్ తినడం ప్రారంభిస్తారు. నిజానికి తెల్ల బియ్యం అన్నంకంటే బ్రౌన్ రైస్ అన్నం తింటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

1 / 5
బ్రౌన్ రైస్‌లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.. బ్రౌన్ రైస్‌లో దాదాపు అన్ని పోషకాలు ఉంటాయి. బ్రౌన్ రైస్‌లో మెగ్నీషియం, ఫాస్పరస్, సెలీనియం నుంచి విటమిన్ బి, ఫైబర్ వరకు అన్నీ పుష్కలంగా ఉంటాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

2 / 5
బ్రౌన్ రైస్‌లో అధిక మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అజీర్ణం, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. శరీర బరువును సరిగ్గా నిర్వహించడంలో బ్రౌన్ రైస్ కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.బ్రౌన్ రైస్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఈ పదార్థాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రౌన్ రైస్ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్, రక్తపోటు అదుపులో ఉంటాయి. దీంతో గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

3 / 5
అంతేకాకుండా ఈ బియ్యం తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉంటాయి. అందుకే బ్రౌన్ రైస్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. బ్రౌన్ రైస్‌లోని కార్బోహైడ్రేట్లు, ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఇది టైప్-2 మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు వైట్ రైస్ మానేసి బ్రౌన్ రైస్ తింటే వేగవంతమైన ప్రయోజనాలు పొందుతారు. ఈ పౌష్టికాహారం బరువును అదుపులో ఉంచుతుంది. బ్రౌన్ రైస్ తింటే త్వరగా ఆకలి వేయదు. దీనిలో తక్కువ కేలరీలు బరువును వేగంగా తగ్గిస్తుంది.

4 / 5
అన్నం తినడం వల్ల శరీరంలో ఎంత శక్తి ఉత్పన్నం అవుతుందో, బ్రౌన్ రైస్ తినడం వల్ల కూడా అంతే శక్తి వస్తుంది. బ్రౌన్ రైస్ లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. రోజంతా పని చేసే శక్తిని పొందడానికి భోజనంలో బ్రౌన్ రైస్ హాయిగా తినవచ్చు.

5 / 5
Follow us