మనం పని చేసే ప్రదేశాన్ని బట్టే మన జీవనం, మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనం పని చేసే ప్రదేశం పరిశుభ్రంగా, గాలి వెలుతురు వచ్చేటట్టుగా ఉంటే మన శ్రద్ధ, ఏకాగ్రత పెరగటంతో పాటు పని సామర్థ్యం, సంపాదన కూడా పెరుగుతాయి. అందువల్ల మనం ఎక్కడ పని చేసినా పని వాతావరణం అనుకూలంగా ఉండవలసిన అవసరం ఉంది. వాస్తు శాస్త్రం ఈ విషయంలో మనకు వీలైనంతగా సహాయపడు తుంది. మనం చేసేది చిన్న వ్యాపారమైనా, పెద్ద వ్యాపారమైనా కొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తే జీవితంలో ఆదాయపరంగా స్థిరపడటానికి, పురోగతి చెందడానికి అవకాశం ఉంటుంది.