ఒంటెల కోసం చైనా ఎవరు చేయని పని చేసింది..! దీని వెనుక కారణం ఏంటో తెలుసా..?
Traffic Signal for Camels : ట్రాఫిక్‌లో ఎటువంటి ఇబ్బంది ఉండకుండా మానవులకు రోడ్లపై ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తారు. కానీ ఇప్పుడు చైనా ఒంటెల
Traffic Signal for Camels : ట్రాఫిక్‌లో ఎటువంటి ఇబ్బంది ఉండకుండా మానవులకు రోడ్లపై ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తారు. కానీ ఇప్పుడు చైనా ఒంటెల కోసం ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసింది. దీనికి కారణం ఏమిటో తెలుసా.. చైనా ఒంటెల కోసం ప్రపంచంలో మొట్టమొదటి ట్రాఫిక్ సిగ్నల్‌ను డన్‌షువాంగ్ నగరంలోని మింగ్షా పర్వతం,క్రెసెంట్ స్ప్రింగ్‌లో ఏర్పాటు చేసింది. ఒంటెలకు మొదటి సిగ్నల్ కావడంతో ఇది అన్ని చోట్ల చర్చించబడుతోంది. ఒక సమాచారం ప్రకారం, గన్సు ప్రావిన్స్ ప్రాంతం పర్యాటకులకు ప్రసిద్ది చెందింది, ఈ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు ఇక్కడ ఒంటె స్వారీని ఆనందిస్తారు.
విండ్‌బ్లోన్ దిబ్బలతో చూసేందుకు ఆకర్షణీయంగా ఉండే అక్కడి ఇసుక తిన్నెల్లో నడుస్తున్నా లేదా గాలి వీచినా డ్రమ్స్ లేదా ఉరుములతో కూడిన సౌండ్స్ వినిపిస్తాయి. అందుకే దీన్ని ‘సింగింగ్ శాండ్స్ మౌంటెయిన్’గా పిలుస్తుంటారు. ప్రధానంగా ఎడారి ప్రాంతంలో సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడాన్ని సందర్శకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ క్యామెల్ రైడ్ స్పెషల్ అట్రాక్షన్ కాగా, ఒంటెపై స్వారీ చేసే సయమంలో మిగతా ఒంటెలతో యాక్సిడెంట్ కాకుండా ఉండటానికి ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. కాగా ఒంటెల కోసం ఈ తరహా ట్రాఫిక్ లైట్స్ ఏర్పాటు చేసిన తొలి దేశం తమదేనని చైనా అధికారులు చెబుతున్నారు. సాధారణ ట్రాఫిక్ సిగ్నల్ మాదిరిగానే, ఒంటెలు రహదారిని దాటడానికి గ్రీన్ సిగ్నల్, వాటిని ఆపడానికి ఎరుపు రంగు సిగ్నల్స్ అమర్చారు.