RR vs DC IPL 2021 Highlights: రాజస్థాన్ అద్భుత విజయం.. సిక్స్ తో మ్యాచ్ ఫినిష్ చేసిన మోరిస్..
RR vs DC Live Score in Telugu: ఐపీఎల్ 14వ సీజన్ 7వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో
RR vs DC IPL 2021 Highlights: ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఢిల్లీ ఇచ్చిన 147 స్వల్ప పరుగుల లక్ష్యంతో మ్యాచ్ మొదలు పెట్టిన రాజస్థాన్ జట్టు మొదట్లోనే తడబడింది. వరుస వికెట్లు కోల్పోతూ జట్టు కష్టాల్లోకి వెళ్లింది. అయితే మిల్లర్, మోరిస్‌లు జట్టును విజయ తీరాలకు చేర్చారు. దీంతో రాజస్థాన్ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా మిల్లర్ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ చేజారిపోతుందునుకుంటున్న సమయంలో క్రిస్ మోరిస్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్‌లో 12 పరుగులు అవసరమైన వేళ మోరిస్ చెలరేగి ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు.
ఇక అంతకు ముందు బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ.. 147/8 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్(51), లలిత్ యాదవ్(20), కరన్(21) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. రాజస్థాన్ బౌలింగ్‌లో ఉనడ్కట్ మూడు వికెట్లు, రెహమాన్ రెండు, మోరిస్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 148 పరుగుల టార్గెట్ చేధించాలి.
ఢిల్లీ జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్(కెప్టెన్), రహనే, స్టోయినిస్, వోక్స్, అశ్విన్, లలిత్ యాదవ్, రబడా, టామ్ కరన్, ఆవేశ్ ఖాన్
రాజస్థాన్ జట్టు: మనన్ వోహ్రా, సంజూ శాంసన్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, బట్లర్, శివం దూబే, రియాన్ పరాగ్, రాహుల్ టివాటీ, క్రిస్ మోరిస్, సకరియా, ఉనడ్కట్, రెహమాన్
LIVE NEWS & UPDATES
-
రాజస్థాన్ అద్భుత విజయం.. సిక్స్‌తో మ్యాచ్ ఫినిష్ చేసిన మోరిస్..
చివరి వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్ అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత వరుస వికెట్లు కోల్పోయిప్పటికీ మిల్లర్,మోరిస్ రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.
-
ఉత్కంఠ భరితంగా మారుతోన్న మ్యాచ్.. ఆరు బంతుల్లో 12 పరుగులు..
మ్యాచ్ చివరికి చేరుకునే సమయానికి ఉత్కంఠంగా మారుతోంది. మోరిస్ 19వ ఓవర్‌లో వరుసగా సిక్స్, ఫోర్ సాధించగానే మ్యాచ్ ఒక్కసారిగా మారింది. ప్రస్తుతం రాజస్థాన్ ఆరు బంతుల్లో 12 పరుగులు చేయాల్సి ఉంది.
-
-
మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయనున్న ఓవర్.. తొలి బాల్‌నే సిక్స్‌గా మలిచిన మోరిస్..
రాజస్థాన్ మ్యాచ్ ఓడిపోతుందో గెలిస్తుందో 19వ ఓవర్ నిర్ణయించనుంది. ఇలాంటి కీలక ఓవర్‌లో తొలి బాల్‌ను మోరిస్ సిక్స్‌గా మలిచాడు. రబడా వేసిన బంతిని మోరిస్ సిక్స్‌గా మలిచాడు. ప్రస్తుతం రాజస్థాన్ 9 బంతుల్లో 21 పరుగులు చేయాల్సి ఉంది.
-
18 బంతులు 34 పరుగులు.. రాజస్థాన్ గెలిచేనా..
స్వల్ప లక్ష్యంతో చేధన మొదలు పెట్టిన రాజస్థాన్ తొలి నుంచి వికెట్లు కోల్పోతూ వచ్చింది. మిల్లర్ మ్యాచ్‌ను మలుపు తిప్పుతున్నాడని భావిస్తోన్న సమయంలోనే అవుట్ అయ్యాడు. దీంతో రాజస్థాన్ మరోసారి కష్టాల్లోకి వెళ్లింది. ప్రస్తుతం రాజస్థాన్ 18 బంతుల్లో 34 పరుగులు చేయాల్సి ఉంది.
-
గట్టెక్కిస్తున్నాడు అనుకుంతలోనే అవుట్.. వెనుదిరిగిన మిల్లర్..
మ్యాచ్ ఫలితాన్ని మలుపుతిప్పే పనిలో పడ్డాడు అనుకుంటున్న సమయంలో మిల్లర్ వెనుదిరిగాడు. ఈ వికెట్ రాజస్థాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లుగా మారింది. 43 బంతుల్లో 62 పరుగులు సాధించి మ్యాచ్‌ను మలుపుతిప్పుతున్నాడు అనుకుంటున్న సమయంలో.. డేవిడ్ మిల్లర్ వరుస సిక్స్‌లు కొట్టిన తర్వాత అవీష్ ఖాన్ బౌలింగ్‌లో లలిత్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
-
-
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మిల్లర్.. జట్టు భారాన్ని మోస్తూ..
వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడ్డ జట్టు భారాన్ని మోస్తూ దూసుకెళుతున్నాడు డేవిడ్ మిల్లర్. జట్టు స్కోరును పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మిల్లర్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 40 బంతుల్లో 50 పరుగులు సాధించిన జట్టును విజయ తీరాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు.
-
మంచి పాట్నర్‌షిప్ బ్రేక్..వెనుదిరిగిన రాహుల్ టివాటీ..
జట్టును స్కోరును పెంచే పనిలో పడ్డ మిల్లర్, రాహుల్ టివాటీ భాగస్వామ్యాన్ని రబడా విడగొట్టాడు. రబడా విసిరిన బంతికి లాలిత్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చిన రాహుల్ టివాటీ పెవిలియన్ బాటపట్టాడు.
-
మిల్లర్‌పైనే రాజస్థాన్ ఆశలు.. క్రీజులో నిలిచేనా..
వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లోకి వెళ్లిన రాజస్థాన్‌ను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం మిల్లర్‌పై పడింది. 30 బంతుల్లో 32 పరుగులు చేసిన మిల్లర్ మ్యాచ్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ ప్రయత్నం ఏ మేర ఫలిస్తుందో చూడాలి. ప్రస్తుతం రాజస్థాన్ 51 బంతుల్లో 91 పరుగులు చేయాల్సి ఉంది.
-
కష్టాల్లోకి కూరుకుపోతున్న రాజస్థాన్ మరోవికెట్ గాన్..
రాజస్థాన్ రాయల్స్ వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లోకి వెళుతోంది. ఢిల్లీ బౌలర్లు తమ అద్భుత బౌలింగ్‌తో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ బాటపట్టిస్తున్నారు. తాజాగా అవీష్ ఖాన్ బౌలింగ్‌లో దవాన్‌కు క్యాచ్ ఇచ్చిన రియాన్ పరగ్ పెవిలియన్ బాట పట్టాడు.
-
మరో వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. శివమ్ దూబే అవుట్.. నాలుగు వికెట్లు డౌన్..
రాజస్థాన్ రాయల్స్ జట్టు వికెట్ల పతనం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టు మరో వికెట్ కోల్పోయింది. అవీష్ ఖాన్ బౌలింగ్‌లో దవాన్‌కు క్యాచ్ ఇచ్చిన శివమ్ దూబే పెవిలియన్ బాట పట్టాడు.
-
ఆదిలోనే రాజస్థాన్‌కు ఎదురు దెబ్బ..వరుసగా మూడు వికెట్లు..
148 పరుగుల స్వల్ప పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బతగిలింది. టాప్ బ్యాట్స్‌మెన్ బట్లర్, మనన్ వోహ్రా, సంజూ శాంసన్ వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీంతో రాజస్థాన్ జట్టు కష్టాల్లోకి వెళ్లింది.
-
20 ఓవర్లకు ఢిల్లీ 147/8
మొదటి మ్యాచ్‌లో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్.. రెండో మ్యాచ్‌లో చతికిలబడింది. ముంబై వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 147/8 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. కెప్టెన్ రిషబ్ పంత్(51), లలిత్ యాదవ్(20), కరన్(21) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. రాజస్థాన్ బౌలింగ్‌లో ఉనడ్కట్ మూడు వికెట్లు, రెహమాన్ రెండు, మోరిస్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 148 పరుగుల టార్గెట్ చేధించాలి.
-
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు..
19 ఓవర్‌లో ఢిల్లీ 12 పరుగులు రాబట్టింది. రెండు వికెట్లు కోల్పోయింది. రెండు బౌండరీలు వచ్చిన ఈ ఓవర్‌లో అశ్విన్(7), కరన్(21) ఔట్ అయ్యారు. దీనితో 19 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 136-8 పరుగులు చేసింది.
-
ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ..
క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో లలిత్ యాదవ్ ఔట్ అయ్యాడు. 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. దీనితో ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 102-6 పరుగులు చేసింది.
-
పంత్ ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన ఢిల్లీ..
ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ సాధించాడు. వెంటనే ఔట్ అయ్యాడు. నాలుగు వికెట్లు పడిపోయి కష్టాల్లో ఉన్న టీంను ఆదుకున్న పంత్.. అనూహ్యంగా అర్ధ సెంచరీ పూర్తి చేసిన అనంతరం రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీనితో ఢిల్లీ 88 పరుగుల వద్ద ఐదో వికెట్ నష్టపోయింది.
-
హాఫ్ సెంచరీ సాధించిన పంత్..
ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీ సాధించాడు. నాలుగు వికెట్లు పడిపోయి కష్టాల్లో ఉన్న టీంను ఆదుకున్నాడు. అయితే అనూహ్యంగా అర్ధ సెంచరీ పూర్తి చేసిన అనంతరం రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. దీనితో ఢిల్లీ 88 పరుగుల వద్ద ఐదో వికెట్ నష్టపోయింది.
-
టేవాటియా ఓవర్‌లో పంత్ నాలుగు ఫోర్లు..
మరో వికెట్ పడకుండా ఢిల్లీ కెప్టెన్ పంత్ ఆచితూచి ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే టేవాటియా వేసిన ఓవర్‌లో పంత్ నాలుగు ఫోర్లు కొట్టాడు. దీనితో ఢిల్లీ 11 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.
-
లలిత్ యాదవ్ రెండు ఫోర్లు…
క్రిస్ మోరిస్ వేసిన బౌలింగ్‌లో లలిత్ యాదవ్ రెండు ఫోర్లు కొట్టాడు. దీనితో ఎనిమిదో ఓవర్ ముగిసే సమయానికి ఢిల్లీ 4 వికెట్లు నష్టపోయి 46 పరుగులు చేసింది. క్రీజులో పంత్(17), లలిత్ యాదవ్(8)తో ఉన్నారు.
-
నాలుగు వికెట్లు కోల్పోయిన ఢిల్లీ…
ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. 7 ఓవర్‌లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. స్టోయినిస్ ముస్తాఫిజూర్ రెహమాన్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. దీనితో ఏడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 37-4 పరుగులు చేసింది.
-
మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ…
ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్‌ను ఉనడ్కట్ పెవిలియన్ పంపిస్తున్నాడు. రహనేను 8 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ చేశాడు. ఉనడ్కట్‌కే ఈజీ క్యాచ్ ఇచ్చి రహనే ఔట్ అయ్యాడు. దీనితో ఢిల్లీ 36 పరుగులకు మూడు వికెట్లు నష్టపోయింది.
-
రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ..
ఉనడ్కట్ బౌలింగ్‌లో ధావన్ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధావన్ ఔట్ అయ్యాడు. దీనితో ఢిల్లీ నాలుగు ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసింది.
-
మూడో ఓవర్‌లో రెండు ఫోర్లు…
సకరియా వేసిన మూడో ఓవర్‌లో ఢిల్లీ రెండు ఫోర్లు రాబట్టింది. ఓవర్ మొదటి బంతికి ధావన్ ఓ ఫోర్ కొట్టగా.. చివరి బంతికి రహనే అద్భుతమైన ఫోర్ సంధించాడు. దీనితో మూడు ఓవర్లకు ఢిల్లీ వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది.
-
మొదటి వికెట్ కోల్పోయిన ఢిల్లీ…
ఢిల్లీ ఓపెనర్ల జోరుకు కళ్లెం పడింది. ఉనడ్కట్ బౌలింగ్‌లో పృథ్వీ షా బ్యాక్‌వర్డ్ పాయింట్ వైపు భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి మిల్లర్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీనితో 5 పరుగుల వద్ద ఢిల్లీ మొదటి వికెట్ కోల్పోయింది. రెండు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 5 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది.
-
మొదటి ఓవర్ రెండు రన్స్…
చేతన్ సకరియా వేసిన మొదటి ఓవర్‌లో ఢిల్లీ జట్టు కేవలం రెండు పరుగులు రాబట్టింది. ఈ ఓవర్‌లో ఢిల్లీ ఓపెనర్స్ ఆచితూచి ఆడారు. ధావన్, పృథ్వీ షాలు చెరో రన్ తీశారు. దీనితో ఢిల్లీ ఒక ఓవర్‌కు రెండు పరుగులు చేసింది.
-
రాజస్థాన్ జట్టు ఇది…
రాజస్థాన్ జట్టు: మనన్ వోహ్రా, సంజూ శాంసన్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, బట్లర్, శివం దూబే, రియాన్ పరాగ్, రాహుల్ టివాటీ, క్రిస్ మోరిస్, సకరియా, ఉనడ్కట్, రెహమాన్
Match 7. Rajasthan Royals XI: M Vohra, J Buttler, S Samson, S Dube, D Miller, R Parag, R Tewatia, C Morris, J Unadkat, C Sakariya, M Rahman https://t.co/8aM0TZOSk0 #RRvDC #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 15, 2021
-
ఢిల్లీ టీం ఇలా ఉంది…
ఢిల్లీ జట్టు: పృథ్వీ షా, శిఖర్ ధావన్, రిషబ్ పంత్(కెప్టెన్), రహనే, స్టోయినిస్, వోక్స్, అశ్విన్, లలిత్ యాదవ్, రబడా, టామ్ కరన్, ఆవేశ్ ఖాన్
Match 7. Delhi Capitals XI: P Shaw, S Dhawan, A Rahane, R Pant, M Stoinis, C Woakes, L Yadav, R Ashwin, T Curran, K Rabada, A Khan https://t.co/8aM0TZOSk0 #RRvDC #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 15, 2021
-
రెండు జట్లలోనూ రెండేసి మార్పులు…
రాజస్థాన్, ఢిల్లీ జట్లలో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. గాయం కారణంగా రాజస్థాన్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సీజన్ నుంచి ఔట్ కావడంతో అతడి స్థానంలో డేవిడ్ మిల్లర్.. శ్రేయాస్ గోపాల్ స్థానంలో జయదేవ్ ఉనద్కట్ తుది జట్టులోకి వచ్చారు. అలాగే ఢిల్లీ తుది జట్టులోకి కగిసో రబాడా.. అమిత్ మిశ్రా స్థానంలో లలిత్ యాదవ్‌కు అవకాశం దక్కింది.
-
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాయల్స్..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీనితో పంత్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.
Published On - Apr 15,2021 11:19 PM