Jellyfish Facts: ఈ జీవికి చావు లేదు.. కానీ పెద్ద లోపం మాత్రం ఉంది.. జీవితాంతం అలానే బ్రతకాలి

ఈ భూమిపై జన్మించిన ప్రతి జీవి చనిపోవడం ఖాయం. ఇది ఈ సృష్టిలోనివశించే  అన్ని జీవులకు వర్తించే ప్రకృతి నియమం. ఈ ప్రకృతి చట్టం వర్తించని ఒక జీవి కూడా ఉందని మీకు తెలుసా....

Jellyfish Facts: ఈ జీవికి చావు లేదు..  కానీ పెద్ద లోపం మాత్రం ఉంది.. జీవితాంతం అలానే బ్రతకాలి
Jelly Fish
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 14, 2021 | 12:19 PM

ఈ భూమిపై జన్మించిన ప్రతి జీవి చనిపోవడం ఖాయం. ఇది ఈ సృష్టిలోనివశించే  అన్ని జీవులకు వర్తించే ప్రకృతి నియమం. ఈ ప్రకృతి చట్టం వర్తించని ఒక జీవి కూడా ఉందని మీకు తెలుసా. అవును శాస్త్రవేత్తల నివేదికల ప్రకారం, ప్రకృతి ఈ జీవికి ‘అమరత్వ వరం’ ఇచ్చిందని చెబుతారు. ఈ జీవిని జెల్లీ ఫిష్ అని పిలుస్తారు. విచిత్రమైన శరీర నిర్మాణం కారణంగా ఈ జీవి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. ఈ జీవులు సముద్రపు లోతులలో నివసిస్తాయి. కొన్నిసార్లు అవి నీటి ఉపరితలంపై కూడా కనిపిస్తాయి. భూమిపై జెల్లీ ఫిష్ ఉనికి శతాబ్దాల నాటిదని చెబుతారు. డైనోసార్ల కాలం నుంచి ఇవి భూమిపై ఉన్నాయి. దీని శరీరం 95 శాతం నీటితో తయారవుతుంది. ఈ గుణం కారణంగా, ఇది ఇతర సముద్ర జంతువులకు పారదర్శకంగా కనిపిస్తుంది. జెల్లీ ఫిష్‌కు మెదడు లేదని కొందరు సెంటిష్టులు చెబుతున్నారు. అందుకే వాటి చుట్టూ చిన్న చేపల సమూహం ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే దాని చుట్టూ ఉంటే సురక్షితమని చిన్న చేపలు భావిస్తాయి.

జెల్లీ ఫిష్‌లు చూడటానికి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ వాటి మీసాలు మనిషి చర్మాన్ని తాకినట్లయితే, వారు వెంటనే చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.  ఎందుకంటే వాటి మీసం చాలా విషపూరితమైనది.  ఆ విషం చర్మానికి చాలా హాని చేస్తుంది.

Also Read: ఎద్దుపై చిరుత మెరుపుదాడి.. ఒకటి మెడపట్టగానే… నాలుగు చుట్టుముట్టాయి..ఇక

ఈ వీడియో చూస్తే నవ్వలేక మీ పొట్ట చెక్కలవుతుంది.. చివర్లో ట్విస్ట్ మాత్రం మిస్ అవ్వొద్దు