Poisonous Tress: ఈ చెట్లు, మొక్కలు చాలా ప్రమాదకరమైనవి… టచ్ చేసినా చాలు ప్రాణాలు తీసేస్తాయి..

లక్షలాది చెట్లు, మొక్కలు భూమిపై కనిపిస్తాయి. చెట్లు కార్బన్ డై ఆక్సైడ్‌ను తీసుకుని మనుషులకు అవసరమైన ఆక్సిజన్ విడుదల చేస్తాయి. మానవ మనుగడకు చెట్లు చాలా ముఖ్యం. అయితే ప్రపంచంలో మనుషుల ప్రాణాలను తీసే కొన్ని చెట్లు, మొక్కలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.

|

Updated on: Apr 14, 2021 | 12:17 PM

ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి చెట్టకు ఒక ప్రత్యేకత ఉంది. భూమిపై ఉన్న మానవవాళిని కాపాడటానికి, జంతువుల ఆసరాకు చెట్లు చాలా అవసరం. అయితే  భూమిపై కొన్ని ప్రమాదకరమైన, విషపూరిత చెట్లు ఉన్నాయని మీకు తెలుసా. అంతేకాదు ఆ చెట్లను తాకినా, వాటి కాయలు తిన్నా నిమిషంలోనే మనుషులు చనిపోతారు.

1 / 5
ఆస్ట్రేలియాలో కనిపించే జింపి స్ట్రింగర్ చెట్టుకు ముళ్ళుంటాయి. ముళ్ళ కారణంగా ఆ చెట్టు అందంగా కనిపిస్తుంది. కానీ ఈ ముళ్ళు చాలా ప్రమాదకరమైనవి. ఈ ముళ్ళలో విషం ఉంటుంది. ఆ విషం మానవ శరీరం లోపలికి వెళితే, మరణం కూడా సంభవిస్తుంది.

2 / 5
సెర్బెరా ఓడోలంను 'సూసైడ్ ట్రీ' అని కూడా పిలుస్తారు. ఈ చెట్టు కాయలు, పండ్లు చాలా విషపూరితమైనవి. ఈ విషాన్ని ఒక వ్యక్తికి ఇస్తే, అతడు క్షణాల్లో మరణిస్తాడు.

3 / 5
'టాక్సస్ బకాటా' అని పిలువబడే ఈ చెట్టు ఐరోపా, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో కనిపిస్తుంది . విత్తనాలు మినహా ఈ చెట్టులోని ప్రతి భాగంలో 'టాక్సిన్' అనే విషం ఉంది. ఈ విషం ప్రమాదవశాత్తూ మనిషి శరీరంలోకి వెళ్తే.. క్షణాల్లో చనిపోతాడు.

4 / 5
అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో కనిపించే చెట్టు.. దాని పండు కారణంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చెట్టుగా పరిగణించబడుతుంది. ఈ చెట్టు కాయలు.. పండిన తరువాత బాంబులాగా పేలతాయి. ఒక వ్యక్తి ఆ సమయంలో ఆ పరిసర ప్రాంతాలలో ఉంటే తీవ్రంగా గాయపడతాడు.

5 / 5
Follow us