Viral Video: ఈ వీడియో చూస్తే నవ్వలేక మీ పొట్ట చెక్కలవుతుంది.. చివర్లో ట్విస్ట్ మాత్రం మిస్ అవ్వొద్దు
టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి జనాలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. అందుకు చాలా పెద్ద కారణమే ఉందండోయ్. ఒక మహిళ తన కారును సమాంతరంగా....
టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో చూసి జనాలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు. అందుకు చాలా పెద్ద కారణమే ఉందండోయ్. ఒక మహిళ తన కారును సమాంతరంగా పార్క్ చేయడానికి పడుతున్న కష్టం ఆ వీడియోలో రికార్డు అయ్యింది. ఆమె అంత కష్టపడుతుంటే మీకు నవ్వులాటగా ఉందా అనకండి. ఈ వీడియో చివర్లో ఒక ట్విస్ట్ ఉంది. వీడియోను నిశితంగా పరిశీలిస్తే… ఒక మహిళ తన కారును మరో రెండు వాహనాల మధ్య… రోడ్డు పక్కన పార్క్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కానీ అది కుదరడం లేదు. మహిళ తన కారును సరైన స్థితిలో ఉంచలేక, పార్కింగ్ స్థలంలోకి వెళ్లి, అనేకసార్లు మళ్ళీ బయటకు వచ్చింది
ఆ సమయంలో మరొక మహిళ తన కుక్కను అటుగా నడిపించుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో సదరు మహిళ జిగ్ జాగ్ డ్రైవింగ్‌ను గమనించి, తన పెట్ డాగ్‌ను ఎత్తుకుని అక్కడి నుంచి హుటాహుటిన వెళ్లిపోయింది. ఈ సమయంలో అక్కడకు వచ్చిన మరో మహిళ.. కార్ డ్రైవ్ చేస్తోన్న మహిళకు సాయం చేసింది. కారు స్రైయిట్‌గా పార్క్ చేసే విధంగా సంకేతాలు ఇచ్చింది. ఫైనల్‌గా ఆమె తన కారును అనుకున్న విధంగా పార్క్ చేసింది. దీంతో కారు దిగి వచ్చి సాయం చేసిన మహిళను హగ్ చేసుకుని.. థ్యాంక్స్ చెప్పింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
ఎన్నో కష్టాలు పడి అక్కడ కార్ పార్క్ చేసిన తర్వాత.. అప్పుటివరకు ఆమెకు సాయం చేసిన మహిళ వెనుక ఉన్న కారు ఎక్కి ఎంచక్కా వెళ్లిపోయింది. ఆమె ముందుగానే ఆ పని ఎందుకు చెయ్యలేదని ఈ వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే మరికొందరు మాత్రం… సదరు మహిళకు కార్ పార్క్ చేయడం నేర్పేందుకు ఆమె అలా చేసిందని ప్రశంశిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో నవ్వులు పూయిస్తుంది.
The way I screamed after watching the end of this video! ???? pic.twitter.com/gTmu58sezO
— Stepmother of Dragons ? (@cheembeam) April 12, 2021
Also Read: ఎద్దుపై చిరుత మెరుపుదాడి.. ఒకటి మెడపట్టగానే… నాలుగు చుట్టుముట్టాయి..ఇక
ఆ జంతువులను చూడగానే తోకముడిచి లగెత్తిన సింహాలు.. ప్రాణభయంతో పరుగో పరుగు