Surprising Video: ఆ జంతువులను చూడగానే తోకముడిచి లగెత్తిన సింహాలు… ప్రాణభయంతో పరుగో పరుగు

జంతువుల చర్యలు మనల్ని చాలాసార్లు నవ్విస్తాయి. కొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తాయి. ఇంకొన్నిసార్లు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ఇక అడవికి రాజు అయిన సింహం....

Surprising Video: ఆ జంతువులను చూడగానే తోకముడిచి లగెత్తిన సింహాలు... ప్రాణభయంతో పరుగో పరుగు
Elephant Attack On Lions
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 13, 2021 | 4:31 PM

జంతువుల చర్యలు మనల్ని చాలాసార్లు నవ్విస్తాయి. కొన్నిసార్లు ఆశ్చర్యపరుస్తాయి. ఇంకొన్నిసార్లు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయి. ఇక అడవికి రాజు అయిన సింహం పంజా పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవి ఉన్న ఏరియాలోకి ఏ జంతువు వెళ్లడానికి సాహసించదు. ఒకవేళ వెళ్లినా బ్రతుకు జీవుడా అంటూ పరుగు లంఖించుకుంటుంది. సింహం గర్జన వినిపించింది అంటే మిగతా జంతువలు అన్నింటికి వణుకు పుడుతుంది. కానీ సింహం కూడా ప్రాణ భయంతో పరిగెత్తడం మీరెప్పుడైనా చూశారా. తాజాగా అటువంటి వీడియోను మీ ముందకు తీసుకొచ్చాం.

ఇప్పటికే మీరు సింహం పవర్ గురించి, దాని భయానక వేట గురించి చాలా వీడియోలు చూశారు. కానీ భయంతో లగెత్తడం మాత్రం ఎప్పుడూ చూసి ఉండరు. అది కూడా ఒకటి కాదు.. సింహాల సమూహమే ప్రాణ భయంతో పరుగులు పెట్టింది. తాజాగా సింహాల సమూహం తాము రెస్ట్ తీసుకుంటున్న ప్లేస్ నుంచి పరిగెత్తాయి. అందుకు కారణం ఏనుగుల మంద వాటివైపు దూసుకురావడం. మీరు దిగువ వీడియోలో చూడవచ్చు. సింహం తన కుటుంబంతో  పచ్చిక బయళ్లపై కూర్చుని సేదదీరుతుంది. అకస్మాత్తుగా వాటికి ఏదో అలికిడి వినిపించింది. ఎవరా అని చూడగానే ఏనుగలు సమూహం. వాటిని చూడగానే సింహాలు పరుగు లఖించుకున్నాయి. ఈ వీడియో ఇప్పుడు వివిధ సోషల్ మీడియా  ప్లాట్‌ఫామ్‌లలో తెగ సర్కులేట్ అవుతుంది. ఈ వీడియోను ‘లైఫ్ అండ్ నేచర్’ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

Also Read: ఎద్దుపై చిరుత మెరుపుదాడి.. ఒకటి మెడపట్టగానే… నాలుగు చుట్టుముట్టాయి..ఇక

పెరట్లో పేడ దిబ్బ తొలగిస్తుంటే… చేతికి అస్థిపంజరం తగిలింది.. ఆరా తీయగా షాకింగ్ ట్విస్ట్