Shocking Video: ఎద్దుపై చిరుత మెరుపుదాడి.. ఒకటి మెడపట్టగానే… నాలుగు చుట్టుముట్టాయి..ఇక

కొన్నిసార్లు జంతువులు వేటాడే శైలి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మీరు గమనిస్తే.. చిరుతలు లేదా సింహాలు.. మందలో కూడా ఒక జంతువునే టార్గెట్ చేస్తాయి.

Shocking Video: ఎద్దుపై చిరుత మెరుపుదాడి.. ఒకటి మెడపట్టగానే... నాలుగు చుట్టుముట్టాయి..ఇక
Lepords Attack On Bull
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 13, 2021 | 12:16 PM

కొన్నిసార్లు జంతువులు వేటాడే శైలి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. మీరు గమనిస్తే.. చిరుతలు లేదా సింహాలు.. మందలో కూడా ఒక జంతువునే టార్గెట్ చేస్తాయి. దాన్ని మాత్రమే మూకుమ్మడిగా వెంటాడతాయి. కడుపు నింపుకోవడం కోసం అవి చూపించే  తెలివి, చతురత చూస్తే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. తాజాగా అలాంటి వీడియోను మీ ముందుకు తీసుకురాబోతున్నాం.  నాలుగు చిరుతపులులు ఒక అడవి ఎద్దును వేటాడిన తీరు చూస్తే మీరు షాక్‌కు గురవుతారు. ఎద్దు చివరిక్షణం వరకు తన ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తూనే ఉంది. కాని చిరుతపులులు దానికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఒక చిరుతపులి దాడి చేస్తేనే.. తప్పించుకుని వెళ్లడం చాలా కష్టం. అలాంటిది నాలుగు ఒక్కసారే ఎగబడి వస్తే.. పరిస్థితి ఇలానే ఉంటుంది.

చిరుతపులి ఎంత ప్రమాదకరమైనదో మనందరికీ తెలుసు. దాని చాతుర్యం, వేగం చూస్తే.. ఏ జంతువుకైనా చెమటలు పడతాయి. అది అడవి అయినా, నివాస ప్రాంతమైనా చిరుతకు బెదురు ఉండదు. చాలా సార్లు, చిరుతపులిని చూసిన తరువాత పెద్ద జంతువులు కూడా తోకముడిచి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. తాజా వీడియోలో, ఒక చిరుతపులి అకస్మాత్తుగా ఒక పొలంలో ఒక ఎద్దును వెంటాడింది. చిరుతపులిని చూడగానే అడవి ఎద్దు కంగారులో పరిగెత్తడం ప్రారంభించింది. కానీ, చిరుతపులి వేగం ముందు, ఎద్దు వేగం ఎంత చెప్పండి. దీంతో కొద్ది క్షణాల్లోనే దాన్ని మెడపట్టి నేలకూల్చింది. ఆ తర్వాత వరసగా మరో నాలుగు చిరుతలు అక్కడికి చేరుకుని దానిపై అటాక్ చేశాయి. ఈ వీడియో ఇప్పుడు వివిధ సోషల్ మీడియా  ప్లాట్‌ఫామ్‌లలో తెగ సర్కులేట్ అవుతుంది. ఈ వీడియోను ‘లైఫ్ అండ్ నేచర్’ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

Also Read: ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా మూడు కోట్ల కుచ్చుటోపీ.. డీఆర్డీఓలో ఉద్యోగాల పేరుతో మస్కా.. చివరికి పనిమనిషి కూడా

పెరట్లో పేడ దిబ్బ తొలగిస్తుంటే… చేతికి అస్థిపంజరం తగిలింది.. ఆరా తీయగా షాకింగ్ ట్విస్ట్