AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crazy Challenge: పాములతో 30 సెకండ్లు గడిపితే రూ. 7లక్షలు మీ సొంతం.. ప్రముఖ యూట్యూబర్‌ కొత్త ఛాలెంజ్‌..

Crazy Challenge: సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి రకరకాల ఛాలెంజ్‌లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మొన్నటి వరకు బకెట్‌ ఛాలెంజ్‌, పిల్లో ఛాలెంజ్‌, ఫ్లిప్‌ ఛాలెంజ్‌ ఇలా రకరకాల పేర్లతో ఛాలెంజ్‌లు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా...

Crazy Challenge: పాములతో 30 సెకండ్లు గడిపితే రూ. 7లక్షలు మీ సొంతం.. ప్రముఖ యూట్యూబర్‌ కొత్త ఛాలెంజ్‌..
Snake Challenge
Narender Vaitla
|

Updated on: Apr 13, 2021 | 6:05 PM

Share

Crazy Challenge: సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి రకరకాల ఛాలెంజ్‌లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మొన్నటి వరకు బకెట్‌ ఛాలెంజ్‌, పిల్లో ఛాలెంజ్‌, ఫ్లిప్‌ ఛాలెంజ్‌ ఇలా రకరకాల పేర్లతో ఛాలెంజ్‌లు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఛాలెంజ్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే ఈ ఛాలెంజ్‌తో డబ్బులు కూడా సొంతం చేసుకోవచ్చు. కానీ ఇది అంత సులువైన ఛాలెంజ్‌ మాత్రం కాదు.. ఎందుకంటే పెద్ద పెద్ద పాములతో 30 సెకన్ల పాటు గడపాలి. ప్రముఖ యూట్యూబర్‌ మిస్టర్‌ బీస్ట్‌ ఈ ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టాడు. పాములతో ఉన్న ఓ బాత్‌ టబ్‌లో 30 సెకండ్లు గడిపితే ఏకంగా రూ.7 లక్షలను బహుమతిగా అందిస్తున్నాడు. ఇక ఇదొక్కటే కాకుండా ఒక గాజు బాక్సులో డబ్బులను పెట్టి అందులో పెద్ద పెద్ద బొద్దింకలను వేశాడు.. వాటిని తాకకుండా ఎంత డబ్బు తీసుకుంటే అంత మీ సొంతమన్నమాట. సాలీడులను శరీరంపై పారించడం, ఒంటరిగా ఉన్న గదిలోకి పెద్ద సంఖ్యలో ఎలుకలను వదలడం, పూర్తిగా కుళ్లి పోయి దుర్వాసన వస్తోన్న కాయగూరల తొక్కలున్న టబ్‌లో పడుకోవడం… ఇలా రకరకాల ఛాలెంజ్‌లను తీసుకొస్తూ యూట్యూబ్‌లో హల్చల్‌ చేస్తున్నాడు మిస్టర్‌ బీస్ట్‌. దీంతో ఈ సాహసాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్‌గా మారుతున్నాయి. బీస్ట్‌ ప్రస్తుతం యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన వీడియోకు ఏకంగా రెండు కోట్లకుపైగా వ్యూస్‌ రావడం విశేషం. మరి మీకు కూడా ఇలాంటి సాహసం చేయగలననే నమ్మకం ఉందా..? అయితే ఎందుకు ఆలస్యం మిస్టర్‌ బీస్ట్‌ ఛాలెంజ్‌ స్వీకరించి ప్రైజ్‌ మనీని సొంతం చేసుకోండి.

Also Read: China: మన సరిహద్దులకు దగ్గరలో చైనా మరో ఏర్పాటు.. తన సైనికుల కోసం అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు!

Japan: యూరేనియం వ్యర్ధ పదార్ధాలను సముద్రంలోకి వదిలిపెట్టాలని జపాన్ నిర్ణయం.. గగ్గోలు పెడుతున్న చైనా!

Trisha Krishnan: ఓటీటీ వేదికగా విడుదల కానున్న స్టార్ హీరోయిన్ సినిమా.. నిరాశలో అభిమానులు