China: మన సరిహద్దులకు దగ్గరలో చైనా మరో ఏర్పాటు.. తన సైనికుల కోసం అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు!

కుక్క తోక సామెత సరిగ్గా చైనాకు సరిపోతుంది. ఒక పక్క మన దేశంతో చర్చలు అంటూ నాటకం ఆడుతుంది.. మరోపక్క మన సరిహద్దుల్లో తన బలాన్ని పెంచుకునే పనులు చాప కింద నీరులా నిరాటంకంగా చేసుకుంటూ పోతుంది.

China: మన సరిహద్దులకు దగ్గరలో చైనా మరో ఏర్పాటు.. తన సైనికుల కోసం అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు!
Indo china border
Follow us

|

Updated on: Apr 13, 2021 | 6:07 PM

China: కుక్క తోక సామెత సరిగ్గా చైనాకు సరిపోతుంది. ఒక పక్క మన దేశంతో చర్చలు అంటూ నాటకం ఆడుతుంది.. మరోపక్క మన సరిహద్దుల్లో తన బలాన్ని పెంచుకునే పనులు చాప కింద నీరులా నిరాటంకంగా చేసుకుంటూ పోతుంది. ఎప్పటికప్పుడు చైనా ఎదో ఒక కొత్త వేషం వేస్తూనే ఉంటుంది. తాజాగా మన సరిహద్దులకు అతి దగ్గరగా.. టిబెట్ భూభాగంలో అత్యాధునిక కమ్యూనికేషన్ టవర్ ను ఏర్పాటు చేసుకుంది. సరిహద్దుల్లో ఉన్న తన సైనికులకు మెరుగైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడమే దీని లక్ష్యంగా కనిపిస్తోంది. భారతదేశ సరిహద్దుల సమీపంలో టిబెట్ వద్ద చైనా అత్యాధునికమైన 5జీ కమ్యూనికేషన్ సిగ్నల్ స్టేషన్ ఏర్పాటు చేసింది. అక్కడ తాను ఇంతకుముందే ఏర్పాటు చేయడం ప్రారంభించిన గన్ బాల రాడార్ స్టేషన్లో భాగంగా దీనిని సిద్ధం చేశారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రాడార్ స్టేషన్ ఇదే. ఇది 5,374 మీటర్ల ఎత్తులో నిర్వహిస్తున్నారు. ఈ రాడార్ స్టేషన్ ఇండియా, భూటాన్ బోర్డర్ కు చాలా దగ్గరగా ఉంటుంది. చైనా సంవత్సరం క్రితమే పలు సంస్థలతో కలిసి ఈ ప్రదేశంలో 5జీ స్టేషన్ ఏర్పాటు కార్యక్రమం మొదలు పెట్టింది. దట్టమైన పర్వతాల్లో ఉన్న తన సైనికులకు స్పష్టమైన సిగ్నల్స్ అందించడమే ధ్యేయంగా టిబెట్ లోని నాగార్జే కౌంటీలో ఇది ఉంది. చాలా వ్యూహాత్మకంగా ఇక్కడ దీనిని ఏర్పాటు చేసింది చైనా. భారతదేశంతో వివాదం కొనసాగుతున్న సందర్భంలో సరిహద్దుల వెంట ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్ వర్క్ ఏర్పాటు చేసే పని ప్రారంభించి శరవేగంగా దానిని పూర్తి చేసింది. అత్యధికంగా ఉద్రిక్తతలు రేకెత్తుతున్న పాంగాంగ్ సరస్సులోని దక్షిణ భాగం వరకూ కేబుళ్లను ఏర్పాటు చేసేందుకు అప్పట్లో భారీ ఎత్తున తవ్వకాలు ప్రారంభించింది. భారత సైనికాధికారులు అప్పట్లో వేగవంతమైన సమాచారం కోసం చైనా ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ సిద్ధం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ కేబుళ్ల ద్వారా సరిహద్దుల్లోని దళాలకు వెనుకనున్న సైనిక స్థావరాల నుంచి సురక్షితమైన సమాచారం అందుతుంది. అదే కాకుండా ఎప్పటికప్పుడు ఫోటోలు, డాక్యుమెంట్లు పంపించుకునే వెసులుబాటు ఉంటుంది. ఇంతవరకూ సైన్యానికి సూచనలు ఇవ్వడానికి రేడియోలను వాడుతున్నారు. అందులో మాట్లాడితే దొరికిపోయి అవకాశం ఎక్కువ. వాటి సంకేతాలను అడ్డుకోవడం ఎవరికైనా తేలిక. కానీ, ఆఫ్టికల్ ఫైబర్ తోఅటువంటి పరిస్థితి ఉండదు. సమాచారం సురక్షితంగా చేరవేయవచ్చు అని ఆ అధికారి చెప్పారు.

Also Read: Mars Mission: అంగారక గ్రహంపై అత్యద్భుత డ్యూన్లు.. రంగుల్లో మెరిసిపోతున్న డ్యూన్లకు ఫిదా

Prince Philip death: ముగిసిన బ్రిటన్ ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలు.. హాజరైన మనవడు హ్యారీ