Japan: యూరేనియం వ్యర్ధ పదార్ధాలను సముద్రంలోకి వదిలిపెట్టాలని జపాన్ నిర్ణయం.. గగ్గోలు పెడుతున్న చైనా!

ఇప్పటికే సముద్ర జలాలు కలుషితం అయిపోయాయని ఒక పక్క పర్యావరణ శాస్త్రవేత్తలు అంటుంటే.. మరో పక్క జపాన్ సముద్రంలో యూరేనియం వ్యర్ధ జలాలను వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకుంది.

Japan: యూరేనియం వ్యర్ధ పదార్ధాలను సముద్రంలోకి వదిలిపెట్టాలని జపాన్ నిర్ణయం.. గగ్గోలు పెడుతున్న చైనా!
Uranium Waste Water
Follow us
KVD Varma

|

Updated on: Apr 13, 2021 | 5:43 PM

Japan: ఇప్పటికే సముద్ర జలాలు కలుషితం అయిపోయాయని ఒక పక్క పర్యావరణ శాస్త్రవేత్తలు అంటుంటే.. మరో పక్క జపాన్ సముద్రంలో యూరేనియం వ్యర్ధ జలాలను వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా చైనా నుంచి నిరసనలు.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జపాన్ లోని ఫుకుషిమా అణు ప్లాంట్ సునామీ వల్ల ప్రమాదానికి గురైంది. ఈ ప్లాంట్ నుంచి మిలియన్ టన్నుల వ్యర్ధ జలాలను సముద్రంలోకి వదిలిపెట్టాలనుకుంటోంది జపాన్. దీనిపై అక్కడి మత్స్యకారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చైనా కూడా దీనికి ససేమిరా అంటోంది. నిజానికి ఈ ప్రక్రియ ఎప్పుడో మొదలుకావాల్సి ఉంది. కానీ, వరుసగా వివాదాలు చుట్టుముట్టడంతో జపాన్ వెనక్కి తగ్గింది. అయితే, తాజాగా జపాన్ మరోసారి ఈ విషయంపై ఒక ప్రకటన చేసింది. దీంతో చైనా తీవ్ర స్థాయిలో జపాన్ పై విరుచుకుపడుతోంది. అయితే, జపాన్ చర్యను అంతర్జాతీయ అణుశక్తి మిషన్ (ఐఏఈఏ) సమర్థిస్తుండటం చెప్పుకోదగ్గ విషయం. ఇటువంటివి ఇప్పుడు ప్రతి అణుకేంద్రం వద్దా జరుగుతూనే ఉన్నాయి అని ఆ సంస్థ చెప్పుకోస్తోంది.

ఇక ఈ విషయమై జపాన్ ప్రధాని యషిహిడే సుగా మంత్రిమండలి సమావేశాల్లో మాట్లాడారు. ”అణుకేంద్రం మూసేయాలంటే ఎన్నో ఏళ్ళు పడుతుంది. అందులో ఈ వ్యర్ధ జలాల విషయం కూడా ఒక భాగం. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. సముద్రంలోకి వదిలిపెట్టాలి అనుకుంటున్న నీరు సురక్షితమని తేలిన తరువాతే దానిని సముద్రంలో వదులుతారు”. అంటూ వివరించారు.

సునామీ దెబ్బకు ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం పూర్తిగా దెబ్బతింది. దీంతో దాదాపు 1. మిలియన్ టన్నుల నీటిని అక్కడ ట్యాంకుల్లో ఉంచారు. అణు రియాక్టర్లు, చల్లార్చేందుకు వాడిన నీరు, వర్షపు నీరు ఇందులో ఉన్నాయి. అత్యాధునిక అడ్వాన్స్ లిక్విడ్ ప్రాసెసింగ్ సిస్టం (ఏఎల్ఫీఎస్) వ్యవస్థ ద్వారా ఈ నీటిని శుద్ధి చేసినట్టు జపాన్ ప్రభుత్వం చెబుతోంది. వీటిలో రేడియోధార్మిక వ్యర్ధాలను ఈ పద్ధతిలో చాలావరకూ తొలగించమని జపాన్ తేల్చి చెప్పింది.

Also Read: Israel King Solomon: ఏకంగా 700మందిని పెళ్లిళ్లు చేసుకున్న ఆదేశపు రాజు.. వారిలో విదేశీ యువరాణిలు కూడా

మారుతి వాగనర్ కారును ఎలా మార్చాడో చూడండి..! అతి తక్కువ ధరలో అతి పెద్ద కారు.. వైరల్‌ అవుతున్న వీడియో..