AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israel King Solomon: ఏకంగా 700మందిని పెళ్లిళ్లు చేసుకున్న ఆదేశపు రాజు.. వారిలో విదేశీ యువరాణిలు కూడా

Israel King Solomon: పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. కొంతమందికి కొన్ని పనులు చేయాలంటే ఇష్టం.. దానినే తమ అభిరుచిగా మలచుకుని చరిత్రలో నిలిచిపోయినవారు కూడా..

Israel King Solomon: ఏకంగా 700మందిని పెళ్లిళ్లు చేసుకున్న ఆదేశపు రాజు.. వారిలో విదేశీ యువరాణిలు కూడా
Israel King Solomon
Surya Kala
|

Updated on: Apr 13, 2021 | 12:21 PM

Share

Israel King Solomon: పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. కొంతమందికి కొన్ని పనులు చేయాలంటే ఇష్టం.. దానినే తమ అభిరుచిగా మలచుకుని చరిత్రలో నిలిచిపోయినవారు కూడా ఉన్నారు.. అయితే ఇజ్రాయిల్ కు చెందిన మహారాజు అభిరుచి భిన్నం.. ఒక వ్యక్తికి ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలు అంటేనే బాబోయ్ ఇంకో భార్య వద్దు అనే వారు ఉన్నారు.. అయితే ఇతను ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వందల పెళ్లిళ్లు చేసుకున్నాడు. అవును వివాహంపై ఇష్టంతో ఇజ్రాయెల్ దేశానికి చెందిన రాజు ఏకంగా 700 పెళ్లిళ్లు చేసుకున్నాడు.. అతను ఎవరో తెలుసుకుందాం..!

ఇజ్రాయెల్ రాజు సులేమాన్ తన జీవితకాలంలో మొత్తం 700 వివాహాలు చేసుకున్నాడు. అతనికి 700మంది భార్యలతో పాటు, 300 మంది పరిచారకులు కూడా ఉన్నారని చారిత్రిక కథనం. సులేమాన్ రాజుకు పెళ్లిళ్లు చేసుకోవడం అంటే చాలా ఇష్టమట.. అందుకనే పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ. అలా 700మంది మహిళలను భార్యలుగా చేసుకున్నాడు. అంతేకాదు.. మరో 300మందిని తనకు సపర్యలు చేయడానికి పెట్టుకున్నాడు. వీరంతా ఎల్లప్పుడూ సులేమాన్ సేవలో నిమగ్నమై ఉండేవారట. ఇలా పెళ్లి చేసుకున్నవారిలో విదేశీ యువరాణులు కూడా ఉన్నారట. సులేమాన్ పెళ్లి విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

చాలా మంది విదేశీ యువరాణులు కూడా వివాహం చేసుకున్నారు:

అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరిచేందుకు సులేమాన్ అనేక మంది విదేశీ యువరాణులను వివాహం చేసుకున్నట్లు చెబుతారు. ఇందుకోసం ఫరాన్ కుమార్తెను కూడా వివాహం చేసుకున్నాడు. సులేమాన్ రాజు ప్రసిద్ధ జెరూసలేం ఆలయాన్ని, అనేక రాజభవనాలు మరియు కోటలను కూడా నిర్మించాడు. అదే సమయంలో, అతను జెరూసలేం ఆలయాన్ని దేశంలోని మత జీవితానికి కేంద్రంగా మార్చాడు. అయితే ఇప్పటి వరకూ సులేమాన్ పెళ్లిళ్ల రికార్డ్ ను ఎవరూ బీట్ చేయలేదని అంటారు. అయితే. సులేమాన్ పిల్లల గురించి చాలా సమాచారం అందుబాటులో లేదు. సులేమాన్ పెళ్లిళ్ల ప్రస్తావన అనేక గ్రంథంలో ప్రస్తావించారు. ఇప్పటికీ ఎక్కువ ప్రాంతాల్లో ఇజ్రాయిల్ రాజు యొక్క వివాహాల గురించి చర్చిస్తూనే ఉంటారు.

Also Read: ఉగాది స్పెషల్ పూర్ణం బూరెలు రుచిగా పర్ఫెక్ట్ గా చేసుకోండిలా …

కరోనా బారిన పడిన నిర్మాత దిల్ రాజు.. టెన్షన్ లో మెగాస్టార్ ‘అభిమానులు’