- Telugu News Photo Gallery Science photos Water on mars evidence of water found on mars nasa curiosity rover sent data
Water on Mars: అంగారక గ్రహంపై నీరు.. కీలక డేటాను సెండ్ చేసిన నాసా పర్సీవరెన్స్ రోవర్..
NASA Mars Mission: మార్స్‌పై నాసా జరుపుతున్న అధ్యయనంలో భాగంగా కీలక సమాచారాన్ని సేకరించింది. నాసాకు చెందిన పర్సీవరెన్స్ రోవర్ ఆసక్తికర విషయాన్ని పసిగట్టింది.
Updated on: Apr 13, 2021 | 12:12 PM

మార్స్‌పై నాసా జరుపుతున్న అధ్యయనంలో భాగంగా కీలక సమాచారాన్ని సేకరించింది. నాసాకు చెందిన పర్సీవరెన్స్ రోవర్ ఆసక్తికర విషయాన్ని పసిగట్టింది. భూమికి సమీపంగా ఉన్న అంగారక గ్రహంపై నీటి జాడ ఉండే ఉంటుందని శాస్త్రవేత్తలు ఇంతకాలం భావిస్తూ వచ్చారు. ఆ భావనకు బలం చేకూర్చే కీలక సమాచారం తాజాగా లభ్యమైంది.

భూమిపై పొరల్లో తడి, పొడి స్థితులు ఉన్నట్లుగానే అంగారక గ్రహం శిలాజాల్లోనూ ఉన్నట్లు గుర్తించారు. తాజాగా రోవర్ పంపిన డేటాతో ఈ అంశంపై శాస్త్రవేత్తలో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి.

నాసా మార్స్ మిషన్‌లో భాగంగా అంగారక గ్రహంపై అడుగు పెట్టిన పర్సీవరెన్స్ రోవర్ కొంత కాలంగా మార్స్‌ను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. అంగారకుడిపై సంచరిస్తున్న ఈ రోవర్ తాజాగా కొత్త విషయాన్ని కనిపెట్టింది.

ఐయోలిస్ మోన్స్ పర్వతంపై సంచరిస్తూ అక్కడ ఉన్న భారీ బిలంలోని అవక్షేప శిలలను పర్సీవరెన్స్ రోవర్ పరీక్షించింది. దానికి సంబంధించిన డేటాను నాసా కేంద్రానికి పంపించింది. ఈ డేటాను పరిశీలించిన శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. మార్స్‌పై నీరు ఉండే ఛాన్స్ ఉందని నిర్ధారణకు వచ్చారు.

భూమి మాదిరిగానే మార్స్‌పై వందల అడుగుల లోపల పరిస్థితులు వేగంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి రాళ్ల నిర్మాణంలోనూ నీటి జాడకు సంబంధించి అనేక ఆనవాళ్లను గుర్తించారు.

పర్సీవర్ రోవర్ పంపిన డేటాను నాసా శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. పూర్తి అధ్యయనం చేసిన తరువాత మరింత సమాచారాన్ని వెల్లడించనున్నారు.




