18 నెలల బాలుడి కడుపులో పిండం.. గర్భిణి స్త్రీ మాదిరి పెరుగుతున్న పొట్ట.. మహారాష్ట్రలోని పూణెలో విచిత్ర ఘటన..

మహారాష్ట్ర పుణెలోని పింప్రి ఆస్పత్రిలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. 18 నెలల బాలుడి కడుపులో పిండం పెరుగుతున్న కేసు శస్త్రచికిత్స కోసం వచ్చింది.

18 నెలల బాలుడి కడుపులో పిండం.. గర్భిణి స్త్రీ మాదిరి పెరుగుతున్న పొట్ట.. మహారాష్ట్రలోని పూణెలో విచిత్ర ఘటన..
18 Months Child Body
Follow us
uppula Raju

| Edited By: Rajeev Rayala

Updated on: Mar 12, 2021 | 11:51 PM

మహారాష్ట్ర పుణెలోని పింప్రి ఆస్పత్రిలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. 18 నెలల బాలుడి కడుపులో పిండం పెరుగుతున్న కేసు శస్త్రచికిత్స కోసం వచ్చింది. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న వైద్యులు విజయవంతంగా ఆ బాలుడి నుంచి అరకిలో ఉన్న చనిపోయిన పిండాన్ని బయటికి తీశారు. ప్రస్తుతం ఆ బాలుడు సురక్షితంగా ఉన్నాడు. కేసు విషయానికి వస్తే వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

నేపాలీ సంతతికి చెందిన ఓ మహిళ 18 నెలల క్రితం అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ శిశువు పుట్టిన తరువాత అతనికి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అతను తరచుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడటం తల్లిదండ్రులు గమనించారు. కొన్ని రోజుల క్రితం, అతని కడుపు గర్భిణీ స్త్రీలా పెరుగడం గమనించారు. శిశువు పరిస్థితి రోజు రోజుకు విషమంగా తయారైంది. చికిత్స కోసం డాక్టర్ పింప్రి. డి. వై. పాటిల్ ఆసుపత్రిలో చేరారు. దీని తరువాత, పిల్లల వైద్యులు శిశువుపై అన్ని పరీక్షలు చేసినప్పుడు, వారికి ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ శిశువు తల్లికి రెండు పిండాలున్నాయి. పిండాలలో ఒకటి మరొక పిండం లోనికి వెళ్ళినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది. శిశువు పుట్టిన తరువాత అతడి కడుపులో పిండం పెరుగుతూ వచ్చింది. కాబట్టి శిశువుకు సరైన మరియు పూర్తి పోషణ లభించలేదు. దీంతో రోజు రోజుకు అతడి ఆరోగ్యం క్షీణించింది. ఈ సమస్య నుంచి ఆ బాలుడు బయటపడాలంటే కడుపులో ఉన్న పిండాన్ని తొలగించడం ఒక్కటే మార్గమని వైద్యులు భావించారు.

కణితిని వేరు చేయడం వైద్యులకు సవాలుగా మారింది. శిశువు శరీర సోనోగ్రఫీ, సిటి స్కాన్ నివేదిక పరిశీలించి.. పిండం శిశువు కాలేయం, కుడి మూత్రాశయం మధ్యలో ఉన్నట్లు తెలుసుకున్నారు. పెద్ద రక్త నాళాలకు అనుసంధానించబడినట్లు చెప్పారు. అలాగే, పిండం చనిపోయినట్లు నిర్ధారించారు. పెద్ద రక్త నాళాలు, కాలేయం, మూత్రాశయం మరియు ప్రేగులకు ఎటువంటి నష్టం లేకుండా మొత్తం కణితిని తొలగించారు.

పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి డా. ప్రణబ్ జాదవ్ మరియు అతని బృందం ఆరు గంటలు కష్టపడి శిశువుకు తిరిగి ప్రాణం పోశారు. అయితే కడుపు నుంచి తొలగించబడిన పిండం 550 గ్రాముల బరువు ఉంది. అంతేకాకుండా వేళ్లు మరియు కాలి, చర్మం, జుట్టు, ఎముకలు మరియు ఇతర అవయవాలు ఏర్పడ్డాయి. అనంతరం డాక్టర్లు ఈ శస్త్రచికిత్స గురించి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఇలాంటి కేసులు 200 వరకు నమోదయ్యాయని తెలిపారు. ఐదు లక్షల మంది పిల్లలలో ఒకరు ఇలాంటి అరుదైన కేసుతో వస్తారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 200 కేసులు నమోదయ్యాయి. దీనిని వైద్య పరిభాషలో ‘ఫిటస్ ఇన్ ఫెటు’ అంటారని వివరించారు.

FCI Recruitment 2021 : భారత ప్రభుత్వ రంగ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ .. అర్హత ఏమిటంటే..!