Coelacanths Extinct Fossil Fish : హిందూ మహాసముద్రంలోని మడగాస్కర్ తీరంలో షార్క్ చేపలను పట్టే వేటగాళ్లు డైనోసార్ శకంనాటి అంతరించిపోయిన చేపను సజీవంగా పట్టుకున్నారు. ఈ చేప జాతి సుమారు 42 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. ఈ చేపను కోలకాంత్ అంటారు. సొర చేపలను పట్టుకోవడానికి వేసిన ప్రత్యేక వలలో ఇది చిక్కింది. ఈ వేటగాళ్ళు లోతైన సముద్రంలో భారీ వలలు వేసి షార్క్ చేపలను వేటాడుతారు. సముద్రం లోపల 328 అడుగుల నుంచి 492 అడుగుల వరకు వలలు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తారు. కోలకాంత్ చేప 1938 సంవత్సరానికి పూర్వం అంతరించిపోయినట్లు పరిగణించబడింది. ఈ చేపను సజీవంగా పట్టుకున్నప్పుడు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతారు. అయితే త్వరలో ఈ జాతి అంతమవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
కోయిలకాంత్ ఎనిమిది రెక్కలు, పెద్ద కళ్ళు, చిన్న నోరు, శరీరంపై ప్రత్యేక చారలు కలిగి వింతగా ఉంది. దక్షిణాఫ్రికా జర్నల్ ఆఫ్ సైన్స్ లో జరిపిన ఒక పరిశోధన ప్రకారం.. సొరచేపల వేట కోయిలకాంత్ చేపల ఉనికికి ముప్పు తెచ్చిపెట్టింది. షార్క్ చేపల వేట 1980 ల నుంచి తీవ్రమైంది. మడగాస్కర్ వివిధ కోయిలకాంత్ జాతుల కేంద్రంగా మారిందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే వీటి వేటను ఆపడానికి అక్కడి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇది వాటి ఉనికికి ప్రమాదంగా పరిణమించవచ్చు.