AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాలకు రిలయన్స్ మద్దతు.. లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా.. అంబులెన్సులకు ఉచితంగా ఇంధనం

Reliance Support : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాలకు రిలయన్స్ మద్దతు.. లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా..  అంబులెన్సులకు ఉచితంగా ఇంధనం
Reliance Support
uppula Raju
|

Updated on: May 17, 2021 | 7:37 PM

Share

Reliance Support : దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో బాధితులు మరణిస్తున్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ లేక, మరోవైపు ఆక్సిజన్ లేక అల్లాడిపోతున్నారు. ఇటువంటి సంక్షోభంలో కొన్ని సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు చేస్తున్నాయి. ఈ కోవలోకి రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా చేరింది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు సేవలందించిన రిలయన్స్ తాజాగా తెలుగు రాష్ట్రాలకు కూడా తనవంతు మద్దతును అందించనుంది.

కోవిడ్ సహాయక చర్యలకు ప్రభుత్వం ఉపయోగించే అత్యవసర వాహనాలకు, అంబులెన్స్‌లకు రిలయన్స్ పెట్రోల్ బంకులు ఉచిత ఇంధనాన్ని అందించనున్నాయి. సంబంధిత ప్రభుత్వ అధికారులు జారీ చేసిన అనుమతి లేఖల ఆధారంగా అన్ని అత్యవసర సేవా వాహనాలు, అంబులెన్సులకు రోజుకు ఒక వాహనానికి గరిష్టంగా 50 లీటర్ల ఇంధనాన్ని రిలయన్స్ బంకులు ఉచితంగా అందిస్తాయి. ఈ సదుపాయాన్ని జూన్ 30 వరకు ప్రకటించింది.

ఆక్సిజన్ కొరత సమస్యను సమర్ధంగా ఎదుర్కొనేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు రిలయన్స్ తన వంతు సాయాన్ని అందిస్తోంది. ఈ మేరకు తెలంగాణకు 80 టన్నులు, ఆంధ్రప్రదేశ్ కు మరో 80 టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ ను రిలయన్స్ సమకూర్చింది. ఆక్సిజన్ ఎక్సప్రెస్ ఈ కంటైనర్లను రిలయన్స్ జామ్‌నగర్ ప్లాంట్ నుంచి తీసుకువచ్చి హైదరాబాద్, గుంటూరు రైల్వే స్టేషన్లకు ఆదివారం నాటికి చేరవేసింది.

వైరస్ కలిగించిన ముప్పును అధిగమించేందుకు తన వనరులు, మానవశక్తి, ఉపకరణాలు అన్నిటినీ రిలయన్స్ ఉపయోగిస్తోంది. రిలయన్స్ 1,000 మెట్రిక్ టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సీజన్ ను దేశవ్యాప్తంగా సమకూరుస్తోంది. ఇది భారతదేశ ఆక్సీజన్ ఉత్పత్తిలో 11 శాతం లేదా ప్రతీ 10 మంది రోగుల్లో ఒకరికి అవసరమైన దాంతో సమానం. దీనికి రిలయన్స్ అండగా నిలిచింది. మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సీజన్ రవాణాను సులభతరం చేసేందుకు గాను రిలయన్స్ 32 ఐఎస్ఒ కంటెయినర్లను దిగుమతి చేసుకుంది.

Tv9

Tv9

నల్ల జీలకర్ర నూనెతో జుట్టు రాలడానికి చెక్.. ఆయిల్ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలి పెట్టరు.. ఎలా వాడాలంటే…

Cyclone Tauktae Live: గుజరాత్ దిశగా ‘తౌటే’ తుఫాన్.. రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. రాత్రి తీరం దాటే అవకాశం

Cyclone Tauktae: ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌.. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా..!