Cyclone Tauktae: ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌.. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా..!

Cyclone Tauktae: ‘తౌటే’ తుఫాను దేశ పశ్చిమ తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్న ఈ తుఫాను ప్రస్తుతం..

Cyclone Tauktae: ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌.. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా..!
Mumbai Cyclone Tauktae
Follow us
Subhash Goud

|

Updated on: May 17, 2021 | 7:03 PM

Cyclone Tauktae: ‘తౌటే’ తుఫాను దేశ పశ్చిమ తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్న ఈ తుఫాను ప్రస్తుతం మరింతగా బలపడింది. తుఫాను మరింత బీభత్సం సృష్టించనుందని వాతావరణ శాఖ ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది. ఇప్పటికే ముంబైలో ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. తుఫాను కారణంగా నౌకలు సైతం కొట్టుకుపోతున్నాయి. ఈ తుఫాను వల్ల వీస్తున్న భీకరగాలులతో ముంబాయికి పశ్చిమ తీరాన హైవేలో ఓ వ్యాపార నౌక కొట్టుకుపోయింది. ఈ నౌకలో 273 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన నేవీ సిబ్బంది వారిని రక్షించడం కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో పరిస్థితులపై ప్రధాని నరేంద్రమోదీ ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో సోమవారం మోదీ ఫోన్‌లో మాట్లాడారు. తుఫాను కారణంగా జరిగే నష్టాల గురించి సీఎంను అడిగి తెలుసుకున్నారు. అయితే తుఫాను కారణంగా భారీ ఈదురు గాలులతో పెద్ద పెద్ద చెట్లు సైతం రోడ్లపైనే కూలిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ రోజు రాత్రి కూడా ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను కారణంగా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, అన్ని రకాలుగా అండగా ఉంటామని ప్రధాని మోదీ సీఎంకు భరోసా ఇచ్చారు. అలాగే గుజరాత్‌ ముఖ్యమంత్రి  విజయ్‌ రూపానీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌లతో కూడా మోదీ మాట్లాడారు. తుఫాను సృష్టిస్తున్న బీభత్సంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, తుఫానుతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఉదయం నుంచి మూసివేశారు. మరింత నష్టం జరుగకుండా ముంబై వాసులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

ఇవీ చదవండి:

Cyclone Tauktae: బీభత్సం సృష్టిస్తున్న ‘తౌటే’ తుఫాను.. 273 మందితో కొట్టుకుపోయిన నౌక.. రంగంలోకి దిగిన సహాయక బృందాలు..!

భార‌త్ సీర‌మ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 25 లక్షల విలువైన వ్యాక్సిన్లు దగ్ధం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!