Cyclone Tauktae: బీభత్సం సృష్టిస్తున్న ‘తౌటే’ తుఫాను.. 273 మందితో కొట్టుకుపోయిన నౌక.. రంగంలోకి దిగిన సహాయక బృందాలు..!

Cyclone Tauktae: ఒక వైపు కరోనా మమహ్మారి విజృంభిస్తుంటే.. మరో వైపు తుఫాను భయాందోళన కలిగిస్తోంది. ‘తౌటే’ తుఫాను దేశ పశ్చిమ తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. కేర‌ళ‌,..

Cyclone Tauktae: బీభత్సం సృష్టిస్తున్న ‘తౌటే’ తుఫాను.. 273 మందితో కొట్టుకుపోయిన నౌక.. రంగంలోకి దిగిన సహాయక బృందాలు..!
Tauktae Cyclone
Follow us
Subhash Goud

|

Updated on: May 17, 2021 | 6:26 PM

Cyclone Tauktae: ఒక వైపు కరోనా మమహ్మారి విజృంభిస్తుంటే.. మరో వైపు తుఫాను భయాందోళన కలిగిస్తోంది. ‘తౌటే’ తుఫాను దేశ పశ్చిమ తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్న ఈ తుఫాను ప్రస్తుతం మరింతగా బలపడింది. తుఫాను మరింత బీభత్సం సృష్టించనుందని వాతావరణ శాఖ ఆయా రాష్ట్రాలను హెచ్చరించింది. ఇప్పటికే ముంబైలో ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ‘తౌటే’ తుఫాన్ అతి తీవ్రమైన తుఫానుగా మారి గుజరాత్ తీర ప్రాంతాల వైపు కదులుతోంది. ఈ తుఫాను కారణంగా గుజరాత్‌లోని సూరత్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముంబైకి పశ్చిమ దిశగా 15 కి.మీ దూరంలో ఉన్న తుఫాన్.. గంటకు 20 కి.మీ వేగంతో ఈ తుఫాన్ కదులుతోంది. ముందుగా ఈ నెల 18న తీరాన్ని దాటుతుందని అంచనా వేయగా.. సోమవారం రాత్రి 8.30 గంటల నుంచి 11.30 మధ్య గుజరాత్‌లోని పోరుబందర్-మహువా మధ్య తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారి మహారాష్ట్ర సహా పలు తీరప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి.

కొట్టుకుపోయిన భారీ నౌక..

కాగా, ఈ రాత్రికి తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ముంబాయి నగరానికి ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది. ఐసోలేటెడ్‌ ప్రాంతాల్లో బలమైన గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ తుఫాను వల్ల వీస్తున్న భీకరగాలులతో ముంబాయికి పశ్చిమ తీరాన బాంబే హైవేలో ఓ వ్యాపార నౌక కొట్టుకుపోయింది. ఈ నౌకలో 273మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. విషయం తెలుసుకున్న నౌకాదళం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఐఎన్‌ఎస్‌ కొచ్చి యుద్ధ నౌక సాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు. కాగా, ఈ వారం చివరి నాటికి హిందూ మహాసముద్రం తుఫానులకు అనుకూలమైన వాతావరణంగా మారుతుందని చెబుతున్నారు.

ఇవీ కూాడా చదవండి:

Cyclone Tauktae Live: గుజరాత్ దిశగా ‘తౌటే’ తుఫాన్.. రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. రాత్రి తీరం దాటే అవకాశం

భార‌త్ సీర‌మ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 25 లక్షల విలువైన వ్యాక్సిన్లు దగ్ధం

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే